జెఎన్ యు ఘటన.. ఇనుపరాడ్లు, కర్రలతో గూండాల వీరవిహారం

ఇనుపరాడ్లు, కర్రలు చేతబట్టుకుని గూండాలు జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీకి చెందిన హాస్టళ్లల్లో వీర విహారం చేసిన దృశ్యాలు ఈ భవనం నుంచి తీసిన మొబైల్ ఫోన్ ఫుటేజీలో బయటపడ్డాయి. వీరి  దాడిలో అనేకమంది విద్యార్థులు, ఫాకల్టీ సభ్యులు గాయపడ్డారు. ఈ హాస్టళ్ల లో పరిస్థితి భీతావహంగా కనిపించింది. ముసుగులు ధరించిన వారు హాస్టల్స్ లోని ఒక్కో గదికి వెళ్లి విద్యార్థులపై దాడులకు దిగారు. ఈ ఎటాక్స్ లో 30 మందికి పైగా విద్యార్థులు. 12 మంది అధ్యాపకులు […]

జెఎన్ యు ఘటన.. ఇనుపరాడ్లు, కర్రలతో గూండాల వీరవిహారం

Edited By:

Updated on: Jan 06, 2020 | 11:29 AM

ఇనుపరాడ్లు, కర్రలు చేతబట్టుకుని గూండాలు జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీకి చెందిన హాస్టళ్లల్లో వీర విహారం చేసిన దృశ్యాలు ఈ భవనం నుంచి తీసిన మొబైల్ ఫోన్ ఫుటేజీలో బయటపడ్డాయి. వీరి  దాడిలో అనేకమంది విద్యార్థులు, ఫాకల్టీ సభ్యులు గాయపడ్డారు. ఈ హాస్టళ్ల లో పరిస్థితి భీతావహంగా కనిపించింది. ముసుగులు ధరించిన వారు హాస్టల్స్ లోని ఒక్కో గదికి వెళ్లి విద్యార్థులపై దాడులకు దిగారు. ఈ ఎటాక్స్ లో 30 మందికి పైగా విద్యార్థులు. 12 మంది అధ్యాపకులు గాయపడినట్టు అనధికారవర్గాల సమాచారం. ముసుగు దొంగల్లా గూండాలు చెలరేగిపోతుంటే విద్యార్థినులు భయంతో కేకలు పెట్టారు. తమను ఎదిరించబోయినవారిపై సంఘ వ్యతిరేకశక్తులు విచక్షణారహితంగా విరుచుకపడ్డారు. గాయాల బారిన పడి బాధితులు విలవిలలాడుతుండగా గూండాలు మరింత చెలరేగిపోయారు. హాస్టళ్లలో ఇంత ఘోరం జరుగుతున్నప్పటికీ.. బయట మోహరించిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం విశేషం. చేత కర్రలు, ఇతర ఆయుధాలు పట్టుకుని యూనివర్సిటీ ఆవరణలోకి వీరు ప్రవేశిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.