పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా శివసేన నేత సంజయ్ రౌత్ !

శివసేన ఎంపీ సంజయ్ రౌత్  పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయనను నియమిస్తున్నట్టు సేన  ప్రకటించింది. ఈయనతో బాటు మరో పది మంది సభ్యులు ...

పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా శివసేన నేత సంజయ్ రౌత్ !

Edited By:

Updated on: Sep 08, 2020 | 1:51 PM

శివసేన ఎంపీ సంజయ్ రౌత్  పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయనను నియమిస్తున్నట్టు సేన  ప్రకటించింది. ఈయనతో బాటు మరో పది మంది సభ్యులు సేన అధికార ప్రతినిధులుగా నియమితులయ్యారు. వీరిలో కొందరు లోక్ సభ ఎంపీలు కూడా ఉన్నారు. తనకు కొత్త పదవి లభించిందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘సామ్నా’ పత్రికలో కీలక ఆర్టికల్స్ రాస్తున్న ఈయన ఇక పార్టీ తీసుకునే నిర్ణయాలను, కార్యాచరణ తదితరాలను మీడియాకు వివరించనున్నారు.

సంజయ్ రౌత్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య తలెత్తిన కీచులాట మెల్లగా సద్దుమణిగే పరిస్థితి కనిపిస్తోంది. ఆమెకు వై కేటగిరీ భద్రత కల్పించాలన్న ఉన్నత స్థాయి నిర్ణయం కూడా సంజయ్ రౌత్ వెనక్కి తగ్గడానికి కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.