
ఎమర్జెన్సీ టైమ్‌లో సంజయ్‌గాంధీ అత్యంత క్రూరంగా వ్యవహరించారు, నిర్బంధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి దేశానికి మాయనిమచ్చగా మారారు..! ఎవరో కాదు స్వయానా కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ ఒక పత్రిక్కి రాసిన వ్యాసంలో చేసిన కామెంట్లివి. సాక్షాత్తూ ఇందిరాగాంధీ కుమారుడినే టార్గెట్ చేసిన ఫైర్‌బ్రాండ్ అతడు. తర్వాత ప్రధాని మోదీ సభలో కూడా కనిపించారు. ఆపరేషన్ సింధూర్‌కి అదేపనిగా ప్రమోషన్ చేశారు. ఆయనగారి రెబలిజంపై సీనియర్లు సోషల్ మీడియాలో విమర్శలు చేయడమే తప్ప.. అధిష్టానం మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి చర్యా తీసుకోలేదు. మొన్నటి కేరళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం రేసులో ఉన్నట్టు వార్తలొచ్చాయి. అదీ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం తీరు. అక్కడ హైకమాండ్ ఒక బ్రహ్మపదార్థం. ఉందో లేదో తెలీదు. అమాటకొస్తే లోకల్ కటౌట్లదే అక్కడ పెత్తనం. దేశంలో ఏమో గానీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం డెమొక్రసీ నాలుగుపాదాలా నడుస్తుందంటారు. కర్నాటకలో ముగిసినట్టే ముగిసి, మళ్లీ మొదలౌతున్న కుర్చీలాట కూడా అదేగా చెబుతోంది? పేరుకే ఆలిండియా కాంగ్రెస్ పార్టీ.. కానీ, ఆలిండియాలో ఆ పార్టీ ఆనవాళ్లెక్కడ? ఒకప్పుడు ప్యాన్ ఇండియా పార్టీగా చెలాయించింది. ఇప్పుడైతే సీన్ మారింది. నేషనల్ పార్టీకి తక్కువ. రీజినల్ పార్టీకి ఎక్కువ అన్నట్టుంది పరిస్థితి. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో...