సీబీఐ దర్యాప్తు ఫలితంగా సుశాంత్ కేసు పరిష్కారమవుతుందనే తాను ఆశిస్తున్నానని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ పేర్కొన్నారు. ఈ కేసులో ఈ సంస్థకు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ట్వీట్ చేశారు. సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆషామాషీ గా జరగదనే ఆశిస్తున్నా.. అని వ్యాఖ్యానించిన ఆయన..ఈ సందర్భంగా 2013 లో హేతువాది నరేంద్ర ధబోల్కర్ హత్యను ప్రస్తావించారు. ఆ కేసులో సీబీఐ దర్యాప్తు 2014 వరకు జరిగిందని, కానీ పరిష్కారం కాకుండా ఉండిపోయిందని పవార్ గుర్తు చేశారు. సుశాంత్ కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరగాలన్న బీజేపీ డిమాండును పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ సమర్థించడం, దానిపై శరద్ పవార్ అతడిని మందలించడం తెలిసిందే.
అటు సుప్రీమ్ కోర్టు తీర్పును స్వాగతించిన పార్థ పవార్..సత్యమే జయిస్తుందని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ కేసు శరద్ పవార్ కుటుంబంలో చిన్నపాటి వివాదాన్నే రేకెత్తించింది.
I am sure the Maharashtra Govt will respect the judgement of the Supreme Court to handover Sushant Singh Rajput’s case to the CBI and fully cooperate in the investigation process.
— Sharad Pawar (@PawarSpeaks) August 20, 2020