Bihar: నితీశ్‌ కుమార్‌ క్యాబినేట్‌ విస్తరణ.. మంత్రివర్గంలోకి కొత్తగా 17 మందికి ఛాన్స్‌..

Nitish Kumar cabinet: బీహార్ సీఎం నితీశ్ కుమార్ మంగళవారం త‌న క్యాబినెట్‌ను విస్త‌రించారు. కొత్త‌గా ఈ రోజు మరో 17 మంది...

Bihar: నితీశ్‌ కుమార్‌ క్యాబినేట్‌ విస్తరణ.. మంత్రివర్గంలోకి కొత్తగా 17 మందికి ఛాన్స్‌..

Updated on: Feb 09, 2021 | 3:42 PM

Nitish Kumar cabinet: బీహార్ సీఎం నితీశ్ కుమార్ మంగళవారం త‌న క్యాబినెట్‌ను విస్త‌రించారు. కొత్త‌గా ఈ రోజు మరో 17 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. వారి చేత గ‌వ‌ర్న‌ర్ ఫాగూ చౌహాన్ ప్ర‌మాణం చేయించారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన 17 మంది మంత్రులల్లో కేంద్ర మాజీ మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌ కూడా ఉన్నారు. అందరూ ఊహించినట్లుగానే ఆయన్ను కూడా బీహార్‌ మంత్రివర్గలోకి తీసుకున్నారు. గ‌త నెల‌లోనే షానవాజ్‌ హుస్సేన్‌ మండ‌లికి ఎన్నిక‌య్యారు.

రాజ్‌ భవన్‌లో వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా గవర్నర్‌ ఫాగూ చౌహాన్.. షానవాజ్‌ హుస్సేన్ తో ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే ఈరోజు ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో జేడీయూ నేత‌లు సంజ‌య్ కుమార్ జా, శ్రావ‌ణ్ కుమార్‌, లేసి సింగ్‌, బీజేపీకి చెందిన మ‌ద‌న్ సాహ్ని, ప్ర‌మోద్ కుమార్‌ ఉన్నారు.

అయితే బీహార్లో 36 మందితో క్యాబినెట్‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు నితీశ్ క్యాబినెట్‌లో 13 మంది మాత్ర‌మే ఉన్నారు. తాజాగా 17 మంది చేరడంతో ఈ సంఖ్య 35కి చేరింది.

Also Read:

Ghulam Nabi Azad Emotional: హిందుస్థానీగా గర్విస్తున్నా.. ఆయన నుంచే అన్నీ నేర్చుకున్నా…!

ఆజాద్‌ను కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. మేం చేస్తాం: కేంద్ర మంత్రి అథవాలే సంచలన వ్యాఖ్యలు