Sex Scandals: రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్స్.. కన్నడ నాట మరీ అధికం.. అమెరికాలోను అంతే!

|

Mar 06, 2021 | 3:10 PM

కర్నాటక మంత్రి సెక్సీ వీడియోస్ సంచలనం రేపడంతో ఇపుడు అందరి దృష్టి ఇలాంటి ఉదంతాలపై పడింది. గతంలో దేశీయంగాను, అంతర్జాతీయంగాను ఇలాంటి ఉదంతాలు ఎన్నో వెలుగు చూశాయి. ప్రముఖ సెక్స్ స్కాండల్స్, లైంగిక ఆరోపణలు ఎదుర్కున్న, పదవులను కోల్పోయిన, జైలు శిక్ష పడిన నేతల కథ ఏంటో ఒకసారి చూద్దాం...

Sex Scandals: రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్స్.. కన్నడ నాట మరీ అధికం.. అమెరికాలోను అంతే!
Follow us on

Sex Scandals rocks Politics always: రాజకీయ నాయకులకు, సెక్స్ కుంభకోణాలకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఇటీవల అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోను ఇలాంటివి వెలుగులోకి వచ్చినా పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో అన్నీ బయటపడుతున్నాయి. మీడియాకు మసాలా అందిస్తున్నాయి. రాజకీయ నాయకుల పరువు తీస్తున్నాయి. వారి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ సెక్స్ స్కాండల్స్, లైంగిక ఆరోపణలు ఎదుర్కున్న, పదవులను కోల్పోయిన, జైలు శిక్ష పడిన నేతల కథ ఏంటో ఒకసారి చూద్దాం…

1999లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బావమరిది సాధు యాదవ్‌పై వచ్చిన రేప్ ఆరోపణలు అప్పట్లో సంచలనం రేపాయి. 1999లో ఓ అమ్మాయిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసినట్లు సాధు యాదవ్ అలియాస్ అనిరుధ్ యాదవ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2003లో హరక్ సింగ్ రావత్ సెక్స్ కుంభకోణం బయటపడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరాఖండ్ మంత్రి హరక్ సింగ్ రావత్‌పై ఆరోపణలు వచ్చాయి. అస్సాం మహిళతో ఆయన లైంగిక కార్యకలాపాలు కొనసాగించినట్లు తేలడంతో ఆయన తన రాజకీయ జీవితాన్నే కోల్పోవాల్సి వచ్చింది. 2003 ఏప్రిల్ 9న అమర్ మణి త్రిపాఠీ – మధుమితా శుక్లా కేసు వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల కవయిత్రి మధుమిత శుక్లా హత్య కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్ మణి త్రిపాఠీ దోషిగా తేలాడు. ఆయన ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తులు 2003 ఏప్రిల్ 9వ తేదీన మధుమితా శుక్లాను కాల్చి చంపారు. ఆమె నివాసంలోనే ఆమె హత్యకు గురయ్యారు. ఈ కేసులో అమర్ మణి త్రిపాఠీ, ఆయన భార్య మధుమణిలకు శిక్ష పడింది. వారికి సహకరించిన రోహిత్ చతుర్వేది, సంతోష్ కుమార్ రాయ్‌లకు జీవిత ఖైదు శిక్ష పడింది. 2007లో వారికి జీవిత ఖైదు విధించింది డెహ్రాడూన్ కోర్టు.

2006లో కశ్మీరీ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సెక్స్ స్కాండల్ వెలుగు చూసింది. తీవ్రమైన ఆరోపణలతో ఓమర్ అబ్దుల్లా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అమ్మాయిలను నేతలు, అధికారులకు ఓమర్ సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓమర్ అబ్దుల్లా సరఫరా చేసిన వారిలో మైనర్ బాలికలు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా కశ్మీర్‌లో వారాల తరబడి హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. 2007 అక్టోబర్ 22న ఆనంద్ సేన్ యాదవ్ – శశిల వ్యవహారం బయటపడింది. న్యాయశాస్త్ర విద్యార్థిని శశితో బీఎస్పీ నేత ఆనంద్ సేన్ యాదవ్ జరిపిన కామ కార్యకలాపాలు వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనం రేపింది. శశితో వివాహేతర సంబంధం పెట్టుకున్న బిఎస్పీ నేత ఆనంద్ సేన్ యాదవ్.. ఆ తర్వాత ఆమెను కిడ్నాప్ చేయించారు. అనంతరం ఆమె హత్యకు గురైంది. ఈ కేసులో ఆనంద్ సేన్ యాదవ్ దోషిగా తేలి, రాజకీయ భవిష్యత్తును కోల్పోయాడు.

2009 డిసెంబర్ 27న ఎన్డీ తివారీ సెక్స్ స్కాండల్ బయటపడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఎన్జీ తివారీ.. ముగ్గురు మహిళలతో అసహజ లైంగిక క్రీడ జరిపి ఏకంగా కెమెరాకు చిక్కారు. 87 ఏళ్ల ఎన్డీ తివారీ లైంగిక వాంఛలు, అసహజ లైంగిక విధానాలు అప్పట్లో సంచలనం రేపాయి. హైదరాబాద్ రాజభవన్‌లో ముగ్గురు మహిళలతో లైంగిక క్రీడ సాగించిన వీడియో టేప్‌లు బహిర్గతమయ్యాయి. దాంతో గవర్నర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు తివారీ ఓ మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధం కారణంగా తను జన్మించానంటే ఓ యువకుడు కోర్టుకెక్కడం.. ఆ తర్వాత అతను హత్య గావించబడడం కూడా సంచలనం రేపాయి.

2011 సెప్టెంబర్ 1న మహిపాల్ మెడర్నా – భన్వరీ దేవి వ్యవహారం బహిర్గతమైంది. 2011లో రాజస్థాన్ మంత్రిగా పనిచేసిన మహిపాల్ మెడర్నా సెక్స్ స్కాండల్ అప్పట్లో ఓ సంచలనం. భన్వరీదేవీ అనే మహిళను అపహరించి, ఆమెపై అత్యాచారం చేసి, చంపేశారని మెడర్నీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2011 సెప్టెంబర్ 1వ తేదీన భన్వరీ దేవి హత్య గావించబడ్డారు. మెడర్నా ప్రోద్బలంతో మల్కాన్ సింగ్ అనే ఎమ్మెల్యే ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

2012 ఆగస్టు 12న గోపాల్ గోయల్ కందా – గీతికా శర్మల వ్యవహారం వెలుగు చూసింది. 23 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసు అప్పట్లో సంచలనం రేపింది. హర్యానాకు చెందిన మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందాపై ఆరోపణలు వచ్చాయి. గోపాల్ కందా లైంగిక వేధింపులు భరించలేక గీతికా శర్మ ఆత్మహత్య చేసుకుందనేది ప్రధానమైన ఆరోపణ. ఢిల్లీలోని అశోక్ విహార్ నివాసంలో గీతికా శర్మ ఆత్మహత్య చేసుకున్నారు.

2012 ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ సెక్స్ టేప్ వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అభిషేక్ మను సింఘ్వీ సెక్స్ సీడీ మీడియాకు మంచి మసాలాను అందించింది. కోర్టు ఆవరణలోని తన చాంబర్‌లో ఓ మహిళా న్యాయవాదితో సెక్స్ చేసిన సింఘ్వీ వ్యవహారం కొంతకాలం ఆయన రాజకీయాలకు దూరమవడానికి కారణమైంది. సీడిలో స్పష్టంగా కనిపించిన సింఘ్వీ.. తనతో లైంగిక సంబంధం పెట్టుకుంటే న్యాయమూర్తిని చేస్తానంటూ నమ్మబలకడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ వ్యవహారంతో ఖంగుతిన్న కాంగ్రెస్ పార్టీ సింఘ్వీని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి వ్యవహారం సద్దుమణగడంతో తిరిగి చేర్చుకుంది.

2012లో కర్నాటక అసెంబ్లీలో పోర్న్ చూస్తూ ముగ్గురు మంత్రులు వీడియోలకు చిక్కారు. కన్నడ మంత్రులు లక్ష్మణ్ సవది, జె. కృష్ణ పలేమర్, సిసి పాటిల్‌ల అత్యుత్సాహాన్ని మీడియా గ్యాలరీ నుంచి చిత్రీకరించి, బహిర్గతం చేశారు. ఏకంగా శాసనసభలో తమ మొబైల్ ఫోన్లలో పోర్న్ క్లిప్స్ చూస్తూ ముగ్గురు మంత్రులు పట్టుబడడం అప్పట్లో పెద్ద సంచలనం. వేరే దేశంలో ఓ మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ దృశ్యాలను చూస్తూ మంత్రులు వీడియోలకు చిక్కారు. 2013 జులై అయిదో తేదీన రాఘవ్‌జీ – స్వలింగ సంపర్కం కేసు ఈ తరహా స్కామ్‌లలో కొత్త తరహా సంచలనానికి దారి తీసింది. మధ్యప్రదేశ్ మంత్రి రాఘవ్‌జీ తన పనిమనిషితో స్వలింగ సంపర్కం చేస్తూ వీడియోలకు చిక్కాడు. ఆర్థిక మంత్రిగా రాఘవ్ జీ.. ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనను లైంగికంగా వాడుకున్నాడని పని మనిషి ఆరోపించాడు. ఈ వ్యవహారంలో రాఘవ్ జీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

రాజకీయాలకు, సెక్స్ కుంభకోణాలకు అవినాభావ సంబంధం వుందనే విషయం ఇప్పటికి పలు మార్లు నిరూపితమైంది. 2013 సెప్టెంబర్ 20వ తేదీన రాజస్థాన్ రాష్ట్ర మంత్రి బాబులాల్ నాగర్‌పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచి తనపై సొంత ఇంటిలో బాబూలాల్ నాగర్ అత్యాచారం చేశారంటూ 35 ఏళ్ల మహిళ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ ఎమ్మెల్యే మహేంద్ర సింగ్ ఏకంగా గోవాలోని ఓ బార్‌లో పోలీసులకు చిక్కాడు. ఏకంగా ఆరుగురు అమ్మాయిలను గోవా తీసుకు వెళ్ళి వారితో మార్చి మార్చి సెక్స్ చేస్తూ పోలీసులకు చిక్కాడు మహేంద్ర సింగ్. సీతాపూర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహేంద్ర సింగ్‌పై వ్యభిచార నిరోధక చట్టం కింద కేసు పెట్టిన పోలీసులు ఆయన చెర నుంచి ఆరుగురు అమ్మాయిలకు విముక్తి కల్పించారు. ఆ తర్వాత ఆయన్ను సమాజ్ వాదీ పార్టీ సస్పెండ్ చేసింది.

2016 జూన్ 9న కర్నాటక మంత్రి పరమేశ్వర్ నాయక్ రాసలీల వీడియో వెలుగులోకి వచ్చింది. పరమేశ్వర్ కారణంగా తన డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన అనుపమ షఎనాయ్.. మంత్రి మరో మహిళతో జరిపిన కామ కార్యకలాపాల వీడియో తన దగ్గరుందని, దానిని త్వరలోనే బయట పెడతానంటూ ప్రకటించారు. సదరు మంత్రి డిఎస్పీని అయిన తనను కూడా లైంగికంగా వేదించారని ఆమె ఆరోపించారు. 2016 నవంబర్ 16న అశ్లీల ఫోటోలు చూసిన కర్నాటక విద్యా శాఖా మంత్రి తన్వీర్ సేఠ్ వార్తలకెక్కారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్లో అశ్లీల ఫోటోలు చూస్తూ కెమెరా కంటికి చిక్కారాయన. కర్నాటక రాజకీయాలను ఈ సంఘటన ఓ కుదుపు కుదిపింది.

2016 డిసెంబర్ 14న కర్నాటక విధాన సౌధ (అసెంబ్లీ)లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నాటక ఎక్సైజ్ శాఖా మంత్రి హెచ్. వై. మేటి మంత్రి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో విడుదల కావడంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖం మీద టవల్ వేసుకుని మీడియా కంటపడకుండా జారుకున్నారు సదరు మంత్రి. ఈ వీడియోని ఆర్టీఐ కార్యకర్త రాజశేఖర్ చిత్రీకరించి మీడియాకు అందించారు. 2017 మే 4న 56 మంది పోర్న్ స్టార్ల ఫొటోలతో కూడిన ఓ పీడీఎఫ్‌ను పోస్టు చేయడం ద్వారా బీజేపీ ఎమ్మెల్సీ మహంతేష్ కవటగిమత్ పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపారు. 2017 అక్టోబర్ 27న ఛత్తీస్‌గఢ్‌ మంత్రి రాజేశ్ మునత్‌ రాసలీలలు వెలుగుచూశాయి. ఆయన సెక్స్ వీడియో అప్పట్లో తెగ వైరలైంది. ఈ వీడియోను విడుదల చేసిన సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మ అప్పట్లో పాపులరయ్యారు.

2019 నవంబర్‌ 30 కర్నాటకలో హనీట్రాప్‌ వ్యవహారం బయటపడింది. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు కన్నాటక పోలీసులు. 2020 అక్టోబర్ రెండో తేదీన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాస సత్యనారాయణపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్తతో సత్య నారాయణ జరిపిన కామ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో ఆయన్ను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. 2020 అక్టోబర్‌ 30న తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తన సన్నిహితురాలితో జరిపిన సెక్సీ చాట్ లీకైంది. మంత్రిపై మరో యువతి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌లపై పోలీసులు ఆరా తీశారు. సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో ఆ చాట్ తనది కాదని గంగుల కమలాకర్ క్లారిఫికేషన్ ఇచ్చారు.

2021 జనవరి 30న కర్నాటక అసెంబ్లీని మరోసారి పోర్న్ వీడియోల వ్యవహారం కుదిపేసింది. అశ్లీల వీడియోలు చూస్తూ కెమెరాకు అడ్డంగా దొరికాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్. 2021 మార్చి 2న కర్నాటక జల వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ టేపుల వ్యవహారం వెలుగులోకి రావడం మరో సంచలనం. ఉద్యోగం కోసం వచ్చిన మహిళతో గడిపారు సదరు మంత్రి. కన్నడ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగడంతో జార్కి హోళీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాసలీల వీడియోలు కన్నడ నాట ఇంకా సంచలన రేపుతూనే వున్నాయి. రూ. 5 కోట్ల ఒప్పందం జరిగిందని మాజీ సీఎం కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మూడు నెలల క్రితమే బ్లాక్‌మెయిల్‌ చేశారని, ఆ సమాచారం తన దగ్గరుందని ఏకంగా మాజీ సీఎం లెవల్ వ్యక్తి చెప్పడం సంచలనం రేపుతోంది. మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి రాసలీలల వ్యవహారంపై ఇంత వరకు కేసు నమోదు కాకపోవడం విశేషం. ఈ వ్యవహారంపై ప్రత్యేక కథనాలతో జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తోంది.

ఆధ్యాత్మిక గురువు పేరిట చలామణీ అయిన స్వామి నిత్యానంద సినీ నటి రంజితతో కలిసి ఉన్న సెక్స్ వీడియో అప్పట్లో పెను సంచలనం రేపింది. కేసు నమోదు అవడం నిత్యానంద అరెస్టవడం జరిగిపోయాయి. తాజాగా కేసుల నుంచి రిలీఫ్ లభించడంతో నిత్యానంద అమెరికాకు సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి.. తన ఆశ్రమాన్ని విస్తరించుకునే పనిలో పడ్డారు. ఆనాడు నిత్యానందతో దొరికిన సినీ నటి రంజిత.. పర్మనెంటుగా ఆయనతోనే సెటిలైపోవడం విశేషం. కాంగ్రెస్‌ పార్టీ కేరళ శాఖ ప్రధాన కార్యదర్శి రాజ్‌మోహన్‌ ఉన్నితాన్‌ మహిళలను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు, కేసులు ఎదుర్కొన్నారు. బీజేపీ నేత సంజయ్‌ జోషి ఓ మహిళతో కలిసిన ఉన్న సీడీలు బయటకు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి హరాక్‌ సర్కార్‌ రావత్‌ పెళ్లి కాని తల్లితో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో రాజీనామా చేశారు. తెహల్కా స్టింగ్‌ ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చిన సమతాపార్టీ కోశాధికారి వ్యవహారం అప్పట్లో సంచలనమే. వేశ్యలను ఏర్పాటు చేసేందుకు బేరాలాడిన సమతా పార్టీ కోశాధికారి.. రక్షణ రంగ కాంట్రాక్టులు వచ్చేట్టు చేయాలంటే తమకు ఖరీదైన వేశ్యలు కావాలని విలేకరులతో డిమాండ్‌ చేసారు కొందరు ఆర్మీ అధికారులు.

కేరళలోని కోజికోడ్‌లో ఐస్‌క్రీం పార్లర్‌ను తమ సెక్స్‌ వ్యాపారానికి ఉపయోగించాడు కేరళ నేత పి.కె.కుంజలికుట్టి. ఈ కుంభకోణంలో పలువురు కమ్యూనిస్టుల నేతలపైనా ఆరోపణలు వచ్చాయి. కాశ్మీర్‌ సెక్స్‌ స్కాండల్‌‌లో తమను సీనియర్‌ అధికారులు, భద్రతాదళాల అధికారులు లైంగిక అవసరాల కోసం ఉపయోగించుకున్నారని బాధిత బాలికలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో ఆరోగ్య మంత్రి కార్యదర్శి గిరిరావు మంత్రి ఛాంబర్‌లోనే శృంగారం జరిపిన మూలంగా ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు.

అంతర్జాతీయంగాను ఎన్నో ఉదంతాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా న్యూడ్ ఫోటోలను పబ్లిగ్గా చూశారనే చర్చ అప్పట్లో అగ్రరాజ్యంలో దుమారం రేపింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వైట్‌హౌస్‌ ఉద్యోగిని మోనికా లూయిన్‌స్కీతో సెక్స్ సంబంధాలు నెరిపారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో క్లింటన్ వ్యవహారం అభిశంసన తీర్మానం దాకా వెళ్ళింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ హాలీవుడ్‌ అందగత్తె మార్లిన్‌ మన్రోతో వ్యవహారం నడిపారన్న వార్తలు అప్పట్లో వైరలయ్యాయి. 1962లో మన్రో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. న్యూయార్క్‌ మాజీ గవర్నర్‌ ఇలియట్‌ స్పిట్జర్‌-ఏకంగా ఎంపరర్స్‌ క్లబ్‌ వీఐపీ పేరుతో 50 మంది వేశ్యలతో ఒక సెక్స్ రాకెట్‌నే నడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయెల్‌ మాజీ అధ్యక్షుడు మోషే కట్సవ్‌ దాదాపు పది మంది మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన పదవి నుంచి తప్పుకున్నాడు. ప్రపంచబ్యాంకు మాజీ అధిపతి పాల్‌ ఉల్ఫోవిజ్‌‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. తన వద్ద పని చేస్తున్న ప్రియురాలు షాహాకు విదేశాంగ మంత్రి జీతం కన్నా అధికంగా ఇచ్చేట్లు పదోన్నతి కల్పించారన్నది అప్పట్లో ఆయనపై వచ్చిన ఆరోపణ. దాంతో పాల్ ఉల్ఫోవిజ్ పదవిని కోల్పోయారు. అమెరికాలో తొలి గే గవర్నర్ జేమ్స్‌ మెక్‌గ్రీవీ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆయన మాజీ అంగరక్షకుడు గోలన్‌ సిపెల్‌ ఫిర్యాదు చేయడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.