Uttarakhand joshimath dam news: ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరద.. నీటమునిగిన గ్రామం.. 100 నుంచి 150 మంది మిస్సింగ్

|

Feb 07, 2021 | 2:00 PM

ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో పెనుప్రమాదం సంభవించింది.  మంచు చరియలు విరిగిపడటం వల్ల  ధౌలిగంగా నది ఉప్పొంగి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది.

Uttarakhand joshimath dam news: ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరద.. నీటమునిగిన గ్రామం.. 100 నుంచి 150 మంది మిస్సింగ్
Follow us on

Uttarakhand joshimath dam news: ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో పెనుప్రమాదం సంభవించింది.  మంచు చరియలు విరిగిపడటం వల్ల  ధౌలిగంగా నది ఉప్పొంగి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. ఈ ఘటనలో 100 నుంచి 150 మంది మరణించి ఉంటారని ఉత్తరాఖండ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్​ వెల్లడించారు

ఆకస్మిక వరద కారణంగా చమోలీ జిల్లా రైనీ గ్రామంలోని తపోవన్‌ ప్రాంతం వద్ద ఉన్న రిషిగంగా పవర్‌ ప్రాజెక్టులోకి నీరు ప్రవేశించి దెబ్బతింది. రైనీ గ్రామంలో ఉన్న ఓ ఆనకట్ట కూడా ధ్వంసమైంది. ఈ డ్యామ్‌ దిగువన అనేక మంది లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తుంటారని తెలిపిన అధికారులు..వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక జిల్లా కలెక్టర్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్​ ఘటన వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అడిగి తెలుసుకున్నారు. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఐటీబీపీ, ఎన్​డీఆర్​ఎఫ్​ డీజీలతో చర్చించారు. ఇప్పటికే యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు సాగుతున్నట్లు వెల్లడించారు షా.

Also Read:

Uttarakhand’s Chamoli Glacier burst LIVE: ఉత్తరాఖండ్‌లో వరద కలకలం.. విరిగిపడ్డ కొండచరియలు.. గ్రామం జలసమాధి..