Sabarimala Yatra: శబరిమల యాత్రలో విషాదం.. లోయలో పడిన టెంపో.. 8 మంది అయ్యప్ప భక్తుల మృతి

|

Dec 24, 2022 | 1:42 PM

శబరిమల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడడంతో 8 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. మరో

Sabarimala Yatra: శబరిమల యాత్రలో విషాదం.. లోయలో పడిన టెంపో.. 8 మంది అయ్యప్ప భక్తుల మృతి
Road Accident
Follow us on

శబరిమల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడడంతో 8 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు నుంచి యాత్రికులు ప్రయాణిస్తున్న టెంపో కేరళలోని ఇడుక్కి జిల్లా కుమిలి-కంబం రహదారిపై వెళ్తుండగా వాగులోకి బోల్తా పడింది. స్థానికులు ఆ ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమచారం అందించచారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా టెంపోలో ఓ చిన్నారితో సహా తొమ్మిది మంది ప్రయానిస్తున్నారు. క్షతగాత్రులను కుమిలిలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈఘటన గురించి ఇడుక్కి జిల్లా కలెక్టర్ కు సమాచారం అందడంతో.. అర్ధరాత్రే అక్కడకు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ సహాయంతో క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..