పోలీసుల కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు మృతి

ఛత్తీస్ గఢ్‌లోని బస్తర్ జిల్లా జగదల్ పూర్‌ తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను కూడా పోలీసులు గుర్తించారు. పోలీసు దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కాగా.. ఇక్కడ అటవీప్రాంతంలో మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించిన భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించినట్టు సమాచారం.

Edited By:

Updated on: Jul 27, 2019 | 9:26 PM