సీరం కంపెనీలో ఇక రష్యన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీ.. సెప్టెంబరు నుంచి ఉత్పత్తి ప్రారంభం

కోవీషీల్డ్ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ లో ఇక రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ టీకామందు కూడా తయారు కానుంది. ఇండియాలో ఇక ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ని ప్రారంభిస్తున్నట్టు సీరం సంస్థతో బాటు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్, సావరిన్ వెల్త్ ఫండ్ ప్రకటించాయి.

సీరం కంపెనీలో ఇక రష్యన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీ.. సెప్టెంబరు నుంచి ఉత్పత్తి ప్రారంభం
Serum Company To Start Production Of Sputnik V Vaccine In India

Edited By:

Updated on: Jul 13, 2021 | 5:46 PM

కోవీషీల్డ్ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ లో ఇక రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ టీకామందు కూడా తయారు కానుంది. ఇండియాలో ఇక ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ని ప్రారంభిస్తున్నట్టు సీరం సంస్థతో బాటు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్, సావరిన్ వెల్త్ ఫండ్ ప్రకటించాయి. ఏడాదికి 300 మిలియన్ డోసులకు పైగా దీన్ని ఉత్పత్తి చేయాలన్నది తమ లక్ష్యమని ఈ సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే సీరం కంపెనీకి రష్యాలోని గమలేయా సెంటర్ నుంచి ఈ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన సెల్,వెక్టార్ శాంపిల్స్ అందాయి. వీటి దిగుమతిని డీజీసీఐ కూడా అనుమతించింది. తమ వ్యాక్సిన్ తయారీకోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ ఫండ్ ఇండియాలో గ్లాండ్ ఫార్మా, హెటిరో బయో ఫార్మా, పనాసియా బయో టెక్ వంటి వివిధ ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే సీరం సంస్థతో కలిసి పని చేయడం తమకు సంతోషంగా ఉందని ఈ ఫండ్ సీఈవో క్రిల్ దిమిత్రియేవ్ తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ అని, దీనికి టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కూడా త్వరలో జరుగుతుందని ఆయన చెప్పారు.

రానున్న నెలల్లో సంయుక్తంగా తొలి బ్యాచ్ టీకామందు ఉత్పత్తి అవుతుందని ఆశిస్తున్నామని అన్నారు. సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా కూడా ఆయనతో ఏకీభవిస్తూ..తమ భాగస్వామ్యం వల్ల ఇండియాలోనే కాక విదేశాల్లోనూ కోట్లాది ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండగలదని, చెప్పారు.మరికొన్ని నెలల్లో తమ రెండు సంస్థలూ కోట్ల డోసుల వ్యాక్సిన్ ని తయారు చేస్తాయని ఆయన వెల్లడించారు.67 దేశాల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ రిజిస్టర్ అయి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి : విస్తారంగా దంచికొడుతున్న వర్షాలు..తడిసిముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు లైవ్ వీడియో..:Heavy Rains in Telugu States Live Video.

 కౌశిక్ రెడ్డి vs రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం.50 కోట్లు ఇచ్చి పీసీపీ చీఫ్‌ అయ్యారంటూ కామెంట్స్..:LIVE Video.

 ముంచుకొస్తున్న సౌర తుఫాన్..గతంలో సూర్యుడి ఉపరితలంపై భారీ తుఫాను..:Solar Storm Moving To Earth Live Video.

 ఆయన హీరో ప్రభాస్ అనుకుంటున్నారు!రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..(వీడియో).:Koushik Reddy on Revanth Reddy Video.