Parliament: వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు.. అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్ష నేతలు..
డ్రగ్స్ నియంత్రణకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందన్నారు హోంమంత్రి అమిత్‌షా. అటు.. చైనాతో సరిహద్దు సమస్యపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చ పెట్టడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు సోనియాగాంధీ.
డ్రగ్స్ నియంత్రణకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందన్నారు హోంమంత్రి అమిత్‌షా. అటు.. చైనాతో సరిహద్దు సమస్యపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చ పెట్టడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు సోనియాగాంధీ. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. చైనాతో తవాంగ్ దగ్గర ఉద్రిక్తతలపై పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు మరోసారి పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఉభయసభల నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నేత సోనియాగాంధీ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. సరిహద్దుల్లో వాస్తవ పరిస్థితిని కేంద్రం ఎందుకు వివరించడం లేదని ప్రశ్నించారు సోనియాగాంధీ. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు.
డ్రగ్స్ నియంత్రణకు కఠినచర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. లోక్‌సభలో డ్రగ్స్‌పై చర్చకు ఆయన సమాధానమిచ్చారు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌ను నియంత్రించడానికి కేంద్రం గట్టి నిఘా పెట్టినట్టు తెలిపారు. డ్రగ్స్ వ్యాపారం నుంచి వచ్చే నిధులు ఉగ్రవాదులకు అందుతున్నాయని చెప్పారు. దేశంలో నార్కో టెర్రర్‌పై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్రాలతో కలిసి కేంద్రం పనిచేస్తోందన్నారు అమిత్‌షా.
అయితే అమిత్‌షా ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలారు తృణమూల్ ఎంపీ సౌగత్‌రాయ్. పోర్ట్‌లకు డ్రగ్స్ ఎలా వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.దీంతో సౌగత్‌రాయ్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అమిత్‌షా. మీరు మాట్లాడండి.. తరువాత నేను మాట్లాడుతా .. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..