AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలనం సృష్టించిన విద్యార్థిని.. ఎంబీబీఎస్ చదువుతూనే సర్పంచ్‌గా ఎన్నికైన యశోధర..

మహారాష్ట్రలో ఎంబీబీఎస్‌ విద్యార్ధిని సంచలనం సృష్టించింది. ఒకపక్క ఎంబీబీఎస్‌ చదువుతూనే, గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైంది. ఓవైపు ఎంబీబీఎస్‌ చదువుతూనే, మరోవైపు రాజకీయాల్లోనూ రాణించింది.

సంచలనం సృష్టించిన విద్యార్థిని.. ఎంబీబీఎస్ చదువుతూనే సర్పంచ్‌గా ఎన్నికైన యశోధర..
Mbbs Student
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 23, 2022 | 7:35 AM

Share

మహారాష్ట్రలో ఎంబీబీఎస్‌ విద్యార్ధిని సంచలనం సృష్టించింది. ఒకపక్క ఎంబీబీఎస్‌ చదువుతూనే, గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైంది. ఓవైపు ఎంబీబీఎస్‌ చదువుతూనే, మరోవైపు రాజకీయాల్లోనూ రాణించింది. 21ఏళ్ల యశోధరా షిండే స్థానిక ఎన్నికల్లో పోటీచేసి ఘనవిజయం సాధించింది. సంగ్లీ జిల్లా మిరాజ్‌ మండలం వడ్డి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైంది యశోధర. ఏదో సాదాసీదాగా గెలవలేదు ఆమె. భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించి గ్రామస్తుల మన్ననలు అందుకుంది.

డాక్టర్‌ కావాలని కలలుగన్న యశోధర.. జార్జియాలో చదువుకుంటోంది. ప్రస్తుతం ఫోర్త్‌ ఇయర్‌ కంప్లీట్‌ చేసుకున్న యశోధర ఎంబీబీఎస్‌ కోర్సు మరో ఏడాది మిగులుంది. అయితే, తానొకటి తలిస్తే, విధి మరొకటి తలచినట్టు ఊహించనివిధంగా పాలిటిక్స్‌లోకి రావాల్సి వచ్చింది. యశోధర కుటుంబం నుంచి ఎవరో ఒకరు సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని గ్రామస్తులు కోరడంతో జార్జియా తిరిగి వచ్చేలా చేసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కోరిక మేరకు సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీచేసింది. బరిలోకి దిగడమే కాదు, ఏకంగా భారీ మెజారిటీతో సూపర్‌ విక్టరీ కొట్టింది యశోధర.

అయితే, గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తూనే, ఎంబీబీఎస్‌ కోర్సును కంప్లీట్‌ చేస్తానంటోంది యశోధర. ఆన్‌లైన్‌లో చదివి డాక్టర్‌ కావాలన్న కలను కూడా నిజం చేసుకుంటానంటోంది ఆమె. ఇక, సర్పంచ్‌గా వడ్డి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానంటోంది యశోధర. ముఖ్యంగా మహిళలు సొంతంగా ఎదిగేందుకు సహకారం అందిస్తానంటోంది. అలాగే, విద్యార్ధుల కోసం ఈ-లెర్నింగ్‌తోపాటు బెటర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ తీసుకొస్తానని చెబుతోంది. గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ల ఆశల మేరకు పనిచేస్తానంటోంది యశోధరా షిండే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..