కరోనాతో ఎస్బీఐ జోనల్ ఆఫీస్ అధికారి మృతి.. మూడు బ్రాంచ్‌ల్లో టెన్షన్‌

| Edited By:

Jul 27, 2020 | 6:40 PM

చిన్న-పెద్ద, కులం-మతం, వయసు, ప్రాంతం తేడా లేకుండా అందరికీ సోకుతున్న కరోనా.. ఇప్పటికే 64 లక్షలకు పైగా ప్రాణాలను తీసుకుంది. ఇటు భారత్‌లోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

కరోనాతో ఎస్బీఐ జోనల్ ఆఫీస్ అధికారి మృతి.. మూడు బ్రాంచ్‌ల్లో టెన్షన్‌
Follow us on

చిన్న-పెద్ద, కులం-మతం, వయసు, ప్రాంతం తేడా లేకుండా అందరికీ సోకుతున్న కరోనా.. ఇప్పటికే 64 లక్షలకు పైగా ప్రాణాలను తీసుకుంది. ఇటు భారత్‌లోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తిరుచ్చిలో కరోనా సోకి ఎస్బీఐ జోనల్ ఆఫీస్‌లో లోన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న సీనియర్ అధికారి(58) కన్నుమూశారు. ఈ నెల 21న అతడికి కరోనాగా నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు.

కాగా ఆ అధికారి సెంటర్‌లో 45మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారందరికీ టెస్ట్‌లు నిర్వహించారు. ఇందులో 20 మందికి పైగా ఉద్యోగులకు పాజిటివ్‌గా సోకినట్లు సమాచారం. అలాగే బ్యాంక్‌తో అనుబంధం ఉన్న మూడు బ్రాంచ్‌ల్లోని 155 స్టాఫ్‌కి టెస్ట్‌లు నిర్వహించారు. వారి ఫలితాలు రావాల్సి ఉంది. ఇక అతడి కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్‌లు నిర్వహించి, హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచారు. మరోవైపు కరోనా కేసుల నేపథ్యంలో బుధవారం వరకు ఆ ప్రాంతం మొత్తాన్ని మూసేసినట్లు తెలుస్తోంది.