రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూ.3 కోట్ల 7 లక్షల విలువైన గంజాయి పట్టివేత.. పక్కా సమాచారంతో గుట్టురట్టు

|

Nov 26, 2021 | 8:21 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. మూడు కమిషనరేట్ పరిధిలో తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి..

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూ.3 కోట్ల 7 లక్షల విలువైన గంజాయి పట్టివేత.. పక్కా సమాచారంతో గుట్టురట్టు
Follow us on

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. మూడు కమిషనరేట్ పరిధిలో తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా ఎస్పీలు, కమిషనర్లు గంజాయి స్మగ్లింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 కోట్ల 7లక్షల రూపాయలు విలువైన గంజాయిని పట్టుకున్నారు రాచకొండ పోలీసులు.

గంజాయిపై స్పెషల్‌ డ్రైవ్‌..

గంజాయి పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. రాచకొండ సిపి మహేష్ భగవత్.. పక్క సమాచారం తో అబ్దుల్లాపూర్ మెట్టు స్టేషన్ పరిధిలో 3 కోట్ల 7లక్షల విలువైన గంజాయి తరలిస్తున్న ముఠా ను ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారని సీపీ తెలిపారు. విశాఖ పట్నం ఏజెన్సీ ప్రాంతాల్లోని సీలేరు నుండి మహారాష్ట్ర కు 1820 కేజీల గంజాయిని రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు. దీని విలువ సుమారు 3 కోట్ల 7 లక్షల 90వేలు ఉంటుందని తెలిపారు. ప్రధాన నిందితుడు సంజయ్ లక్ష్మణ్ షిండే సంవత్సరం నుండి ఈ దందా చేస్తున్నాడని, మొత్తం ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని సీపీ మహేష్ భగవత్ అన్నారు.

టెన్ టైర్ లారీలో విశాఖ ఏజెన్సీ లోని సీలేరు ప్రాంతం నుండి గంజాయిని ముంబై మహారాష్ట్ర తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఐదుగురు నిందితులను రాచకొండ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ లక్ష్మణ్ షిండే జైల్ లో ఉన్నట్టు సమాచారం ఉందని, అరెస్టయిన నిందితుల వద్ద నుండి 3 కోట్ల 7 లక్షల 90 వేల విలువైన గంజాయిని, ఒక లారీ, కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఈ ఏడాది ఎన్ని కిలోల గంజాయిని పట్టుకున్నారంటే..

తెలంగాణ రాష్ట్రంలో కి గంజాయ్, మాదకద్రవ్యాలు ఆంధ్ర ఒరిస్సా నుండి ఎక్కువగా వస్తున్నాయన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. 62 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల నుండి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారే పట్టుబడుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సంవత్సరం 5 వేల కేజీల గంజాయి పట్టుకున్నామని, 31 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు.
ఎన్‌డీపీఎస్‌ లాంటి కఠిన చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామనీ.. ఇలాంటి చట్టాల వల్ల మాదకద్రవ్యాల రవాణా నీ కొంత అరికట్ట గలమని అన్నారు.

హైదరాబాద్‌ నుంచి రాష్ట్రాలకు సరఫరా:

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఇతర రాష్ట్రాల కు గంజాయి సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు పట్టుబడిన కేసులు అన్ని కూడా ఇలాంటి కేసులో ఎక్కువగా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా నుండి హైదరాబాద్ వచ్చి ఇక్కడి నుండి మహారాష్ట్ర, గోవా, బెంగుళూరుకు రవాణా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో గంజాయి విక్రయాలు తక్కువగా ఉన్నప్పటికీ ఇతర రాష్టాల కు రవాణా చేస్తూ పట్టుబడిన కేసులు అధికంగా ఉన్నాయి.

గంజాయితో బ్రెయిన్‌పై ఎఫెక్ట్‌:

మత్తులోని గమ్మత్తేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతోనే ఎక్కువగా ఈ గంజాయి కి అడిక్ట్ అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. స్ట్రెస్ ను తట్టుకో లేని వాళ్ళు, స్కిల్స్ డెవలప్మెంట్ లేని యువత ఎక్కువగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, సమస్యను లీడ్ చేయడం కోసం షార్ట్ వే ఎంచుకోవడం వల్లే ఇలాంటి ఆడిక్ట్స్ పెరుగుతున్నాయని నిపుణులు చెపుతున్నారు. దీని వల్ల బ్రెయిన్ పై ఎక్కువ ఎఫెక్ట్ పడుతోందనీ. పరిపక్వత చెందే వయసులో మత్తు పదార్థాలు వాడటం వల్ల మానసిక వికలాంగులుగా తయారవుతున్నారు. నయా సవేరా లాంటి ప్రోగ్రామ్స్ వల్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. డ్రగ్ అడిక్ట్ నివారణ కోసం చాలా మంది ప్రజలు భాగస్వాములు అయితే తప్ప డ్రగ్స్ను మాదకద్రవ్యాలను కంట్రోల్ చేయలేమన్నారు.

ఆంధ్ర ఒరిస్సా నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు..

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నాయని పోలీసులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పి.డి యాక్ట్ లో నమోదు చేసి ఉరిశిక్ష అమలు ఏవిధంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Road Accident: కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

26/11 Mumbai Attacks: మాననీ గాయం.. ముంబై మరణహోమానికి 13 ఏళ్లు..