Kashmir : కశ్మీర్లో కల్లోలానికి ముష్కరుల స్కెచ్‌, రియాసిలో ఉగ్రవాదుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

|

Mar 07, 2021 | 7:13 AM

Kashmir : ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకు ముష్కరులు స్కెచ్‌లు వేస్తున్నారు. ఇందుకోసం ఉగ్రసంస్థలు భారీ ఎత్తున గన్నులు, పేలుడు పదార్థాలు సిద్ధం చేసుకుంటున్నాయి..

Kashmir :  కశ్మీర్లో కల్లోలానికి ముష్కరుల స్కెచ్‌,  రియాసిలో ఉగ్రవాదుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు
Follow us on

Kashmir : ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకు ముష్కరులు స్కెచ్‌లు వేస్తున్నారు. ఇందుకోసం ఉగ్రసంస్థలు భారీ ఎత్తున గన్నులు, పేలుడు పదార్థాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. రియాసి కొండల్లో దాచిన ఉగ్రవాదుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏకే 47 రైఫిళ్లతో పాటు భారీగా పేలుడు పదార్ధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాదిని కూడా అదుపు లోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. దట్టమైన అటవీప్రాంతంలో ఉగ్రవాదులు ఆయుధాలను దాచినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి.

ఎత్తేన చోట గుహ లాంటి ప్రాంతంలో ఆయుధాలు దాచారు ఉగ్రవాదులు. రియాజ్‌ అహ్మద్‌ అనే ఉగ్రవాది ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో.. జమ్ము కశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ బలగాలు కలిపి ఈ ఆపరేష్‌ నిర్వహించారు. ఇటీవల రియాజ్‌ను మహోర్‌ పట్టణంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో జిల్లా మెజిస్ట్రేట్‌ ముందు ఈ డంప్‌ వివరాలు వెల్లడించాడు. యూబీజీఎల్‌, ఎంజీఎల్‌తోపాటు.. ఐదు గ్రెనేడ్లు, ఒక ఆర్‌పీజీ, మూడు మోర్టార్‌ బాంబులు, 80 రౌండ్ల బులెట్లతోపాటు.. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ మొత్తం సరంజామాను లష్కరే తోయిబా కమాండర్‌ ఖోబైబ్‌ నుంచి సేకరించినట్లు వెల్లడించాడు రియాజ్‌. రాంబన్‌ జిల్లాలోని ఓవ్యక్తికి చేరవేసేందుకు ప్లాన్‌ వేసుకున్నాడు. ఈలోగా సమాచారం అందుకున్న బలగాలు అతడిని పట్టుకుని డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

Read also : Breaking : చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి ప్రధాన అనుచరుడు సాబినేని రాంబాబుపై కాపుకాచి దాడి.. అపస్మారకస్థితిలో బాధితుడు