ఉగ్రస్థావరం గుట్టురట్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం..

| Edited By:

Jul 04, 2020 | 11:00 PM

జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రస్థావరం గుట్టురట్టయ్యింది. జమ్ము డివిజన్‌లోని రాజౌరీ సెక్టార్‌లో శనివారం ఉదయం దోడస్సాన్‌ బాలా గ్రామంలో.. స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో..

ఉగ్రస్థావరం గుట్టురట్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం..
Follow us on

జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రస్థావరం గుట్టురట్టయ్యింది. జమ్ము డివిజన్‌లోని రాజౌరీ సెక్టార్‌లో శనివారం ఉదయం దోడస్సాన్‌ బాలా గ్రామంలో.. స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో.. గ్రామంలోని ఓ ప్రాంతంలో ఉగ్రస్థావరం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ స్థావరాన్ని అదుపులోకి తీసుకుని.. తనిఖీ చేయగా.. అందులో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఓ గ్రేనేడ్ లాంచర్‌తో పాటు.. 11 యూబీజీఎల్ గ్రేనేడ్‌లు,14 ఏకే -47 మ్యాగజైన్లు,2 చైనీస్ పిస్టల్స్‌,2 పిస్టల్‌ మ్యాగజైన్లు,1 చైనీస్ గ్రేనేడ్‌, డిటోనేటర్లు, ఐఈడీ మందుపాతరకు సంబంధించిన మెటిరియల్‌తో పాటు.. పలు ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తనుమండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.