Budget Session 2023: పార్లమెంట్‌ బడ్జెట్‌ మలివిడత సమావేశాలకు రంగం సిద్ధం.. బ్రిటన్‌లో రాహుల్ ప్రకటనపై బీజేపీ.. ఈడీ దాడులపై విపక్షాలు..

|

Mar 13, 2023 | 9:49 AM

విపక్ష నేతల ఇళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు , అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌ మలివిడత బడ్జెట్‌ సమావేశాలు దద్దరిల్లబోతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభమయ్యే సమావేశాలు ఏప్రిల్‌ 6వ తేదీ వరకు కొనసాగుతాయి.

Budget Session 2023: పార్లమెంట్‌ బడ్జెట్‌ మలివిడత సమావేశాలకు రంగం సిద్ధం.. బ్రిటన్‌లో రాహుల్ ప్రకటనపై బీజేపీ.. ఈడీ దాడులపై విపక్షాలు..
Parliament
Follow us on

పార్లమెంట్‌ మలివిడత బడ్జెట్‌ సమావేశాలు మరికాసేపట్లో నుంచి ప్రారంభమవుతాయి. విపక్ష నేతలపై ముప్పేట ఈడీ , సీబీఐ దాడులు జరుగుతున్న సమయంలో జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో మాటల తూటాలు పేలబోతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ జరగనుంది. అదేవిధంగా కీలక బిల్లులు ఆమోదానికి సమావేశాల ముందుకు రానున్నాయి. ఉభయసభల్లో 35 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో రాజ్యసభ‌లో 26 బిల్లులు, లోక్‌సభలో తొమ్మిది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

వీటిలో కీలక బిల్లులు ఆమోదంకోసం సమావేశాల ముందుకు రానున్నాయి. రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విపక్ష నేతలతో సమావేశమయ్యారు. సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష నేతలను ఆయన కోరారు.

బడ్జెట్ సెషన్ మొదటి దశ

విశేషమేమిటంటే, పార్లమెంటు ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన జనవరి 31న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం, రెండవ దశ సెషన్ మార్చి 13 నుండి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది.

బ్రిటన్‌లో రాహుల్ ప్రకటనలపై బీజేపీ ఫైర్..

బ్రిటన్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటనలపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిరంతరం దాడి చేస్తోంది. భారత్‌ను, భారత ప్రజా స్వామ్యాన్ని అవమానించారని కూడా ఆరోపించింది. అదే సమయంలో ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది.

ఉదయం 10 గంటలకు ప్రతిపక్షాల సమావేశం

ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్షాలు సమావేశం కానున్నాయి.

బిల్లులను ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం

అయితే అదానీ వ్యవహారంపై ఉభయసభలు దద్దరిల్లబోతున్నాయి. కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం , అదానీపై జేపీసీ విచారణకు పట్టుబడుతామని విపక్ష నేతలు స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో జీవవైవిధ్య (సవరణ) బిల్లు – 2021, వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు , అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల (సవరణ) బిల్లు- 2019, షెడ్యూల్డ్ తెగలు మూడవ రాజ్యాంగ సవరణ బిల్లు2022, షెడ్యూల్డ్ తెగలు ఐదవ రాజ్యాంగ సవరణ బిల్లు- 2022, తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్ (రద్దు) బిల్లు, పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం (మూడవ) బిల్లు – 2013, ఢిల్లీ అద్దె (రద్దు) బిల్లు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ రాజ్యాంగం సవరణ బిల్లు 2019, ది ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లు (ఖాళీల తప్పనిసరి నోటిఫికేషన్) సవరణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం