School Holidays: సంచలన నిర్ణయం.. జూలై 1 వరకు పాఠశాలలు బంద్‌.. కారణం ఏంటంటే..

|

Jun 19, 2024 | 8:40 AM

పాఠశాలలు బంద్‌ ఉంటున్నాయంటే విద్యార్థులకు ఎక్కడ లేని ఆనందం వస్తుంటుంది. సెలవులు వచ్చాయంటే చాలు ఎక్కడైనా టూర్‌ వేయాలనే ఆలోచన వస్తుంది. లేదా ఎక్కడైనా వెళ్లాలని ప్లాస్‌ చేస్తుంటారు. వేసవి సెలవులను పొడిగిస్తూ ఇక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే తీవ్రమైన వేడి కారణంగా ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

School Holidays: సంచలన నిర్ణయం.. జూలై 1 వరకు పాఠశాలలు బంద్‌.. కారణం ఏంటంటే..
School Holidays
Follow us on

ఉత్తర భారతదేశంలో మండుతున్న వేడి తరంగాల నుండి ఉపశమనం లభించడం లేదు. వాతావరణ శాఖ నిరంతరం హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేస్తోంది. యూపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతోంది. ఎండ వేడిమికి, వడదెబ్బకు చిన్న పిల్లల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి ప్రభుత్వాలు. ఇటీవల, యుపిలోని మునిసిపల్ పాఠశాలలు 8వ తరగతి వరకు విద్యార్థులకు వేసవి సెలవులను పొడిగించారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా వేడిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Aadhaar Update: ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఇన్‌యాక్టివ్‌గా మారుతుందా? కీలక సమాచారం

ఉత్తరప్రదేశ్‌లో..

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్‌లోని కౌన్సిల్ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించారు. రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్ 24 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు జూన్ 28 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 28 శుక్రవారం. అంటే జూన్ 30 లేదా జూలై 1న మాత్రమే పాఠశాలలు తెరిచే అవకాశాలు ఉన్నాయి. యూపీలో వేసవి సెలవులు జూన్ 17తో ముగిశాయి.

ఛత్తీస్‌గఢ్‌లో వేసవి సెలవులు

ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని ఛత్తీస్‌గఢ్ పాఠశాల విద్యా శాఖ కూడా వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడిగించింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Insurance Claim: 45పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?

ఢిల్లీలో వేసవి సెలవులు

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం వేసవి సెలవులను ఇప్పటికే పొడిగించింది. ఇక్కడ పాఠశాలలు జూన్ 30 వరకు మూసివేయనున్నారు. ప్రస్తుతం పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.

పంజాబ్, హర్యానాలో..

పంజాబ్, హర్యానాలలో కూడా పాఠశాలలు జూన్ 30 వరకు మూసి ఉంటాయి. వేడిని దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో కూడా జూలై 1న పాఠశాలలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

రాజస్థాన్‌లో..

ఢిల్లీ, పంజాబ్, హర్యానాల మాదిరిగానే రాజస్థాన్‌లోని పాఠశాలలకు కూడా జూన్ 30 వరకు వేసవి సెలవులు ఉన్నాయి. జూలై 1 నుంచి పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉంది.

బీహార్‌లో..

బీహార్ పాఠశాలల్లో వేసవి సెలవులు జూన్ 18 వరకు మాత్రమే. జూన్ 19 నుండి ఇక్కడ పాఠశాలలు తెరవబడతాయి. అయితే ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయ సంఘం సెలవులు పొడిగించాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా, పాట్నా, గయా జిల్లాల్లో జూన్ 19 వరకు పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. జూన్ 18, 19 తేదీల్లో 1 నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలు మూసి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Diabetes Tips: ఏ వయసులో మధుమేహం అత్యంత ప్రమాదకరం.. నివారించడం ఎలా?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి