
School Holidays: డిసెంబర్ నెల పిల్లలకు సరదాగా ఉండబోతోంది. చలి, వర్షం, తుఫానుల ముప్పు కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు పాఠశాలలు మూసి ఉండనున్నాయి. కొన్ని పాఠశాలలకు అయితే సెలవులను పొడిగించారు అధికారులు. వాతావరణ పరిస్థితులను బట్టి సెలవుల షెడ్యూల్‌లు మారవచ్చు. అందుకే తాజా అప్‌డేట్‌లను కోసం తల్లిదండ్రులు, విద్యార్థులు తమ రాష్ట్ర విద్యా విభాగాలను పర్యవేక్షించాలని సూచించారు.
దిత్వా తుఫాను కారణంగా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నందున పుదుచ్చేరిలోని నాలుగు ప్రాంతాలు: కారైకల్, మహే, యానాంలలో డిసెంబర్ 1, 2025న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్,ఎయిడెడ్ పాఠశాలలు మూసి ఉన్నాయి. అయితే పరిస్థితులను బట్టి సెలవును పొడిగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్ లోయలో శీతాకాలం రికార్డులను బద్దలు కొట్టింది. దీని కారణంగా విద్యా శాఖ మూడు నెలల పాటు సెలవు ప్రకటించింది. ప్రీ-ప్రైమరీ పాఠశాలలు డిసెంబర్ 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు మూసి వేయనున్నారు. 1 నుండి 8 తరగతులు డిసెంబర్ 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు సెలవులు ప్రకటించారు. ఇక 9 నుండి 12 తరగతులు డిసెంబర్ 11, 2025 నుండి ఫిబ్రవరి 22, 2026 వరకు సెలవులు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మకమైన పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వం విద్యా క్యాలెండర్‌లో శీతాకాల సెలవులు కూడా చేర్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు డిసెంబర్ 20 నుండి డిసెంబర్ 31, 2025 వరకు మొత్తం 12 రోజుల శీతాకాల సెలవులు ఉంటాయి. ఈ కాలంలో విద్యార్థులు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించవచ్చు. పాఠశాలలకు డిసెంబర్ 23, 2025 నుండి జనవరి 1, 2026 వరకు (మొత్తం 10 రోజులు) సెలవులు ఉంటాయి.
డిసెంబర్ 25న అన్ని పాఠశాలలకు సెలవు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని పాఠశాలలు డిసెంబర్ 24న (క్రిస్మస్ ఈవ్) ఐచ్ఛిక సెలవు ఇవ్వాలని నిర్ణయించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి