ముఝే నహీ చాహియే ! వ్యాక్సిన్ భయంతో డ్రమ్ము వెనక నక్కిన అవ్వ ! ఆ తరువాత ఏమైందంటే ….?

వ్యాక్సిన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ భయపడుతున్నారు. టీకామందులు తీసుకుంటే తమకు జబ్బులు వస్తాయనో, ఇతర అపోహలు, అనుమానాలు ఉండడంవల్లో చాలామంది వెనకాడుతున్నారు.

ముఝే నహీ చాహియే ! వ్యాక్సిన్ భయంతో డ్రమ్ము వెనక నక్కిన అవ్వ !  ఆ తరువాత ఏమైందంటే ....?
Scared Of Vaccine

Edited By: Phani CH

Updated on: Jun 03, 2021 | 5:28 PM

వ్యాక్సిన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ భయపడుతున్నారు. టీకామందులు తీసుకుంటే తమకు జబ్బులు వస్తాయనో, ఇతర అపోహలు, అనుమానాలు ఉండడంవల్లో చాలామంది వెనకాడుతున్నారు. నిరక్షరాస్యులైతే ఇక చెప్పవలసిన పనే లేదు. ఉత్తరప్రదేశ్ లోని ఎటావా జిల్లాలో తాజాగా జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఈ జిల్లాలోని చందన్ పూర్ గ్రామంలో ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సరితా బహదూరియా అనే స్థానిక ఎమ్మెల్యేతో బాటు కొందరు హెల్త్ కేర్ వర్కర్లు నిన్న ఈ డైవ్ ప్రారంభించి ఓ ఇంటివద్దకు చేరుకోగానే ఆ ఇంట్లోని 80 ఏళ్ళ వృద్దురాలు భయపడిపోయి ఇంట్లోని పెద్ద డ్రమ్ము వద్ద దాక్కుంది. ఆమెకు ఎంత నచ్చజెప్పినా అక్కడి నుంచి కదలలేదు. నేను వ్యాక్సిన్ తీసుకోనని, భయమని ఆమె చెబుతుంటే సదరు ఎమ్మెల్యేకి, హెల్త్ కేర్ వర్కర్లకు ఏం చేయాలో తోచలేదు. టీకామందు మంచిదేనని కోవిద్ రాకుండా చేస్తుందని ఆ ముసలామెకు చెప్పడానికి వారు యత్నించినా ఆమె మాత్రం డ్రమ్ము వెనక నుంచి బయటకు రాలేదు. చివరకు నీకు వ్యాక్సిన్ ఇవ్వబోమని మరీమరీ హామీ ఇచ్చిన తరువాత ఆ అవ్వ బయటకు కాలు పెట్టింది. ఇంకా ఇలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయి.ఈ రాష్ట్రంలోనే బారాబంకీ జిల్లాలో కొందరు గ్రామీణులు వ్యాక్సిన్ బారి నుంచి తప్పించుకోవడానికి దగ్గరలోని నదిలోకి దూకి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు.అది వ్యాక్సిన్ కాదని విషపూరిత మందు అని ఎవరో దుష్ప్రచారం చేయడంతో వారంతా నదిలోకి జంప్ చేశారు.

ఇదే జిల్లాలో గతవారంకొంతమంది గ్రామస్థులు కర్రలతో పరుగెత్తుకు రావడంతో వ్యాక్సిన్ ఇచ్చేందుకు వచ్చిన హెల్త్ కేర్ వర్కర్లు ఇతర సిబ్బంది అంతా తలోదిక్కుకు పరుగులు తీశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. రాళ్లు, రాడ్లు, కర్రలతో వచ్చిన గ్రామీణులు వైద్య బృందంపై దాడికి దిగారు. ఆ ఎటాక్ లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:Corona Data: కరోనా ప్రతిరోజూ లెక్కల్లో మీరిది గమనించారా? ప్రతి సోమవారం కేసులు తక్కువగా కనిపిస్తాయి..ఎందుకంటె.

WTC Final Match: ఎయిర్‌పోర్ట్‌లో కూతురుతో విరుష్క జంట.. జర్నలిస్టుల కంట పడకుండా ఎలా చేశారో చూడండి..