టూరిజానికి సౌదీ గ్రీన్ సిగ్నల్!

|

Oct 04, 2019 | 10:39 PM

సౌదీలో మార్పులు సంభవిస్తున్నాయి. మారుతున్న ప్రపంచానికి తగ్గట్లు ఆ దేశ రూల్స్‌ని సడలిస్తున్నారు. తాజాగా టూరిజం ద్వారా ఆదాయం సంపాదించేందుకు సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. టూరిస్టు వీసాలు ఇష్యూ చేయాలని తొలిసారిగా  నిర్ణయించింది.   సౌదీ యువరాజు మహమ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2030కి అనుగుణంగా ఈ డెసిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నట్టు  ఆ దేశ టూరిజం చీఫ్ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖతీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక ప్రకటనలో తెలిపారు.  ఆరంకో చమురు బావులపై  దాడులు  జరిగిన రెండు వారాల […]

టూరిజానికి సౌదీ గ్రీన్ సిగ్నల్!
Follow us on

సౌదీలో మార్పులు సంభవిస్తున్నాయి. మారుతున్న ప్రపంచానికి తగ్గట్లు ఆ దేశ రూల్స్‌ని సడలిస్తున్నారు. తాజాగా టూరిజం ద్వారా ఆదాయం సంపాదించేందుకు సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. టూరిస్టు వీసాలు ఇష్యూ చేయాలని తొలిసారిగా  నిర్ణయించింది.   సౌదీ యువరాజు మహమ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2030కి అనుగుణంగా ఈ డెసిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నట్టు  ఆ దేశ టూరిజం చీఫ్ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖతీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక ప్రకటనలో తెలిపారు.  ఆరంకో చమురు బావులపై  దాడులు  జరిగిన రెండు వారాల తర్వాత  సౌదీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీసాలపై  తాజా నిర్ణయం తీసుకుంది .‘‘ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిస్టులకు వీసాలు ఇష్యూ చేయడం సౌదీ చరిత్రలోనే ముఖ్యమైన ఘట్టం’’ అని టూరిజం చీఫ్ చెప్పారు. ‘‘సౌదీలో యునెస్కో గుర్తించిన ఐదు  హెరిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదేశాలను చూస్తే టూరిస్టులు ఆశ్చర్యపడతారు’’ అని ఆయన అన్నారు. 49 దేశాల ప్రజలు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్లోనే వీసాలు తీసుకోవచ్చని  ప్రభుత్వ ప్రకటనలో వివరించారు.  ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు తగ్గడంతో ఆ నష్టాన్ని భరించేందుకు టూరిజాన్ని ప్రోత్సహించాలని సౌదీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భావిస్తోంది. 2030 నాటికి 10 లక్షల మంది డొమస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫారెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిస్టుల్ని దేశానికి ఆకర్షించాలన్నది సౌదీ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. టూరిజం ద్వారా 10 లక్షల మంది యువతకు  కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.

సౌదీను సందర్శించే విదేశీ ఆడవాళ్లకు డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్తించదు. ఆరుబయటకు వెళ్లేటప్పుడు సౌదీలో ఆడవాళ్లు  నల్లరంగు బుర్ఖాలను చేతులు, ముఖానికి తప్పనిసరిగా ధరించాలన్న ‘అబయా’  కండిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటికీ అమలులో ఉంది. ఫారెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడవాళ్లకు మాత్రం ఈ కండిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వర్తించదని ప్రభుత్వం  ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. సౌదీ యువరాజు మహమ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం కొత్త విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిశగా  ఇలా పలు రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తున్నారు. లిబరలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానాలను అమలు చేయడం ద్వారా దేశం రూపురేఖల్ని మార్చయడానికి ప్రయత్నిస్తున్నారు.