Satyendar Jain Video: ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి.. తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ.. ఇటీవల సీసీటీవీ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆప్ నేతకు మసాజ్ చేస్తున్న వీడియోపై బీజేపీ సహా పలుపార్టీల నేతల ఆప్ పై విరుచుకుపడ్డాయి. దీనిపై ఆప్ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడికావడం రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ క్రమంలోనే మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. సత్యేందర్ జైన్ ఉన్న లాక్-అప్ లో బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. తాను ఆరు నెలలుగా జైలులో ఒక్క గింజ కూడా తినలేదని.. బయటినుంచి తెచ్చిన ఆహారాన్ని కూడా స్వీకరించలేదని ఆప్ నేత జైన్ కోర్డులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన వీడయో దానిని బట్టబయలు చేసింది.
టీవీ9 భరతవర్ష్ కథనం ప్రకారం.. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సత్యేందర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌లో గత 6 నెలలుగా తనకు వండిన ఆహారం, ఆహార పదార్థాలు ఇవ్వలేవని పేర్కొంది. జైన్ తన పిటిషన్‌లో.. తాను జైన మతాన్ని ఆచరిస్తున్నందున ఇలా జరిగిందని వివరించారు. తన మతం ప్రకారం.. మొదట ప్రార్థనలు చేయకుండా వండిన ఆహారాన్ని తినడానికి అనుమతించరని జైన్ చెప్పారు. జైల్లో సరిగా భోజనం చేయకపోవడం వల్ల 28 కేజీల బరువు తగ్గానని చెప్పారు. అయితే, తీహార్ జైలు వర్గాల సమాచారం ప్రకారం.. జైన్ జైలులో ఉన్నప్పుడు 8 కిలోల బరువు పెరిగారు. కానీ జైన్ లాయర్ మాత్రం 28 కిలోలు బరువు తగ్గారని వాదించడంపై బీజేపీ నేతలు పలు విమర్శలు చేస్తున్నారు.
వీడియో చూడండి..
सुना है सत्येंद्र जैन की जेल में ख़ाना रेडिसन और ताज से आता है लेकिन वकील कह रहे है की 28 किलो वजन कम हो गया है भाईसाब का । pic.twitter.com/2G4gAV5cW8
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) November 23, 2022
ఈ క్రమంలో బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గా.. ట్విట్టర్‌లో రెండు వీడియోలను పోస్ట్ చేశారు. జైలులో జైన్ బయటినుంచి తెచ్చిన ఆహారం తింటున్నట్లు ఇవి చూపిస్తున్నాయి. జైలులో ఉన్న సత్యేందర్ జైన్ కు ఆహారం రాడిసన్, తాజ్ నుంచి వస్తుందని నేను విన్నాను, కాని అతని బరువు 28 కిలోలు తగ్గిందని లాయర్ చెబుతున్నారు.. అంటూ బగ్గా ట్వీట్ చేశాడు.
సత్యేందర్ జైన్‌కు తీహార్ జైలులో మసాజ్ చేస్తున్నట్లు కూడా ఇటీవల ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే.. ముందు ఆప్ దీనిని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అతను ఫిజియోథెరపిస్ట్ అంటూ పేర్కొంది. కానీ.. తీహార్ జైలు సిబ్బంది.. దీనిని తోసిపుచ్చింది. అతను ఫిజియోథెరఫిస్ట్ కాదని తోటి ఖైదీ అని పేర్కొంది.
#WATCH | CCTV video emerges of jailed Delhi minister Satyendar Jain getting a massage inside Tihar jail. pic.twitter.com/VMi8175Gag
— ANI (@ANI) November 19, 2022
58 ఏళ్ల ఢిల్లీ మంత్రిని మనీలాండరింగ్ కేసులో మే 30న అరెస్టు చేశారు. అప్పటినుంచి బీజేపీ, ఆప్ మధ్య వాడీవేడీగా విమర్శలు కొనసాగుతున్నాయి. కావాలనే.. ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని.. గుజరాత్ ఎన్నికల్లో సత్తా చాటుతున్నామని ఈ విమర్శలు చేస్తున్నారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..