సరిహద్దు సైనికులకు శాటిలైట్‌ ఫోన్లు

| Edited By:

Aug 11, 2020 | 5:42 PM

ఇకపై సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే భారత సైనికులకు శాటిలైట్‌ ఫోన్లను అందజేయనున్నారు. సరిహద్దులతో పాటు.. మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత జవాన్లకు శాటిలైట్ ఫోన్లు..

సరిహద్దు సైనికులకు శాటిలైట్‌ ఫోన్లు
Follow us on

ఇకపై సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే భారత సైనికులకు శాటిలైట్‌ ఫోన్లను అందజేయనున్నారు. సరిహద్దులతో పాటు.. మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత జవాన్లకు శాటిలైట్ ఫోన్లు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

బార్డర్లో విధులు నిర్వర్తించే బీఎస్ఎఫ్,ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్, సీఆర్‌పీఎఫ్ జవాన్లకు.. వారి వారి కుటుంబ సభ్యులతో మాట్లడేందుకు వీలుగా ఈ శాటిలైట్‌ ఫోన్లను అందివ్వనున్నట్లు వెల్లడించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో 1347 ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారికి కనెక్టివిటీ కోసం.. శాటిలైట్‌ ఫోన్లను అందించనున్నారు. అంతేకాదు.. బార్డర్లో రోడ్ల నిర్మాణం చేపడుతున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌ ఎంప్లాయిస్‌కు కూడా శాటిలైట్ ఫోన్లను ఇస్తామన్నారు. ఇప్పటికే 183 శాటిలైట్‌ ఫోన్లను అందించినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా వారికి కూడా అందించబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా టెలీకమ్యూనికేషన్‌ సర్వీసులను విస్తరించేందుకు కొత్త ప్రాజెక్టులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

Read More :

దారుణం.. యూపీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

నా క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా.. పుదుచ్చేరి సీఎం