Sasikala Release Date: ఆ రోజే రిలీజ్ అవ్వనున్న శశికళ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌పై వైద్యుల నుంచి రాని క్లారిటీ

|

Jan 25, 2021 | 6:22 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు శశికళ జైలు నుంచి జనవరి 27న విడుదల కానున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారమే...

Sasikala Release Date: ఆ రోజే రిలీజ్ అవ్వనున్న శశికళ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌పై వైద్యుల నుంచి రాని క్లారిటీ
Follow us on

Sasikala Release Date:  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు శశికళ జైలు నుంచి జనవరి 27న విడుదల కానున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారమే శశికళను విడుదల చేస్తామని పరప్పన అగ్రహారం జైలు అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.  కరోనాతో ప్రస్తుతం విక్టోరియా హాస్పిటల్‌లో శశికళ చికిత్స పొందుతున్నారు. అక్కడే విడుదలకు సంబంధించిన ఫార్మాలిటీస్ జైలు అధికారులు పూర్తి చేయనున్నారు.  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌పై వైద్యుల ఇంకా క్లారిటీ రాలేదు. చెన్నై ఎప్పుడు వెళ్లాలన్నది కుటుంబ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం శశికళ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సకు సౌకర్యవంతంగానే స్పందిస్తున్నారని, నోటి ద్వారా సాధారణ రీతిలో ఆహారం తీసుకుంటున్నారని వివరించారు. నిపుణుల పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగుతోందని వివరించారు.

Also Read:

శ్రీకాకుళం జిల్లాలో యువకుడికి చిక్కిన వింత చేప.. దాని పేరు కూడా మత్సకారులకు తెలియదట..!

Pangolin smuggling: మంచిర్యాల జిల్లాలో అలుగును పట్టారు.. కోటిన్నరకు బేరం పెట్టారు.. చివరకు