Sanjay Dutt meets Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్

|

Jun 06, 2021 | 10:03 PM

నాగపూర్‌లోని గడ్కరీ నివాసానికి వెళ్లిన సంజయ్ దత్.. మొదటగా గడ్కరీకి పాదాభివందనం చేసి..

Sanjay Dutt meets Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్
Nitin Gadkari Family And Sa
Follow us on

Sanjay Dutt meets Union Minister Nitin Gadkari : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. నాగపూర్‌లోని గడ్కరీ నివాసానికి వెళ్లిన సంజయ్ దత్.. మొదటగా గడ్కరీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందారు. ఆ తర్వాత గడ్కరీ నివాసంలోని పూజా గదికి వెళ్లి, నమస్కరించారు. అనంతరం ఇరువురు దాదాపు అరగంట పాటు మాట్లాడుకున్నారు.

Sanjay Dutt And Nitin Gadkari

అయితే, సంజయ్ దత్ – కేంద్రమంత్రి గడ్కరీ మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందన్నది తెలియరాలేదు. శనివారమే వీరిద్దరి భేటీ జరిగినప్పటికీ ఈ వార్త ఇవాళే బయటికి వచ్చింది. సంజయ్ దత్ ఏ కారణంగా కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారన్నది కూడా స్పష్టం కాలేదు.

Sanjay Dutt And Nitin Gadkari

కాగా,  సంజయ్ దత్ మర్యాదపూర్వకంగానే గడ్కరీ ఫ్యామిలీని కలిశారన్న వార్త వినిపిస్తుండగా, గడ్కరీతో భేటీ అనంతరం సంజయ్ దత్ మహారాష్ట్ర విద్యుత్ మంత్రి నితిన్ రౌత్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమవడం గమనార్హం.

Read also : Poker Sites : గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున పేకాట.. చిలకలూరిపేట పరిధిలో ఎస్పీ నేతృత్వంలో దాడులు.. లక్షల్లో సొమ్ములు స్వాధీనం