ముంబై డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటన్న ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేను నాలుగు గంటల పాటు ప్రశ్నించింది విజిలెన్స్ . అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదంటున్నారు వాంఖడే. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే విజిలెన్స్ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐదుగురు సభ్యుల ఎన్సీబీ బృందం వాంఖడేను ముంబైలో విచారించింది. నాలుగు గంటల పాటు ఆయన్ను విచారించారు. షారూఖ్ తనయుడు ఆర్యన్‌ను విడిచిపెట్టడానికి వాంఖడే 25 కోట్ల డిమాండ్ చేసినట్టు ఈ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ ఆరోపించారు. ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ లోని బృందం వాంఖడేనే ప్రశ్నించింది.
ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులను ఎన్సీబీ విజిలెన్స్ స్వాధీనం చేసుకుంది. క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక సాక్షిగా ఉన్న గోసావి ఇవాళ విచారణకు రావాలని ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఆర్యన్‌ను అరెస్ట్ చేసిన సమయంలో సమీర్ వాంఖడేతో పాటు గోసావి కూడా అక్కడే ఉన్నారు. అయితే చీటింగ్ కేసులో పరారీలో ఉన్న గోసావి కోసం పుణే పోలీసులు గాలిస్తున్నారు.
ఎన్సీబీ విచారణకు హాజరైన తరువాత తాను పుణే పోలీసుల ముందు లొంగిపోతానని తెలిపారు గోసావి. మరోవైపు షారూఖ్‌ఖాన్ మేనేజర్ పూజా దద్లానీకి కూడా ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని కోరింది. మరోవైపు సమీర్ వాంఖడేపై మరో సాక్షి ప్రభాకర్ సెయిల్ చేసిన ఆరోసణలపై ముంబై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు.
ఆర్యన్‌ను అరెస్ట్ చేసినప్పుడు ప్రభాకర్ ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు సమీర్ వాంఖడే. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తన కుటుంసభ్యులపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.
ఇంకోవైపు నవాబ్‌మాలిక్‌పై ముంబై లోని హోషియారా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు సమీర్ వాంఖడే సోదరి యాస్మిన్ వాంఖడే. తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా నవాబ్‌మాలిక్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి: LPG Gas Prices: దీపావళి ముందే గ్యాస్ బండకు రెక్కలు.. రూ.100 వరకు పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు..
Covid Lockdown: థర్డ్ వేవ్ భయాలు.. దేశంలోని ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్..