Chennai Airport: అచ్చం సూర్య సినిమా సీన్‌ రిపీట్‌ చేశారు..కానీ, కథ అడ్డం తిరిగి అలా బుక్కయ్యారు..

|

May 12, 2022 | 6:50 PM

ధనార్జనే ధ్యేయంగా ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి వ్యాపారం సాగిస్తుంటారు. అయితే, ఇలాంటి చీకటి వ్యాపారం సినిమాలను చూసి నేర్చుకుంటారో లేదంటే, కేటుగాళ్ల పకడ్బంది ప్లాన్లు చూసి సినిమాలు తీస్తారో తెలియదు గానీ..

Chennai Airport: అచ్చం సూర్య సినిమా సీన్‌ రిపీట్‌ చేశారు..కానీ, కథ అడ్డం తిరిగి అలా బుక్కయ్యారు..
Chennai Airport F
Follow us on

స్మగ్లింగ్‌..అక్రమ వ్యాపారం ఏదైనా సరే, అధికారుల కళ్లుగప్పి గుట్టుగా సాగించేస్తారు స్మగ్లర్లు..అది ఖరీదైన బంగారం, వెండి, వజ్రాలు కావొచ్చు. లేదంటే గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలు కానీ. ధనార్జనే ధ్యేయంగా ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి వ్యాపారం సాగిస్తుంటారు. అయితే, ఇలాంటి చీకటి వ్యాపారం సినిమాలను చూసి నేర్చుకుంటారో లేదంటే, కేటుగాళ్ల పకడ్బంది ప్లాన్లు చూసి సినిమాలు తీస్తారో తెలియదు గానీ, అచ్చం సినిమాలో మాదిరిగానే పలు సందర్బాల్లో నిందితులు పట్టుబడటం చూస్తుంటాం..అప్పట్లో హీరో సూర్య మూవీలో చూసినట్టుగానే ఇక్కడ కూడా కొందరు దళారులు డ్రగ్స్‌ సరఫరా సాగించారు. కడుపులో డ్రగ్స్‌ పెట్టుకుని దర్జాగా, షార్జా నుంచి చెన్నైకు చెక్కెశారు..కానీ, వారి పథకం బెడిసి కొట్టి అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు.

మొన్న కోయింబత్తుర్, నేడు చెన్నైలో హెరాయిన్‌ ముఠా గుట్టు రట్టు చేశారు అధికారులు. దీన్ని బట్టి చూస్తుంటే, చెన్నై కోయింబత్తూర్‌ విమానాశ్రయాలు అక్రమ రవాణాకు అడ్డాగా మారిందనే అనిపిస్తోంది. మొన్న కోయింబత్తూర్ లో యుగాండా నుంచి వచ్చిన యువతీ కడుపులో నాలుగు కోట్ల విలువైన డ్రగ్స్ దాచి ఉంచినట్లుగా గుర్తించిన అధికారులు, మొత్తమంతా బయటకు తీయించారు. ఈ క్రమంలోనే షార్జా నుంచి వస్తున్న అన్ని ఇంటర్నేషనల్ విమానాలపై ప్రత్యేక నిఘా పెట్టారు కస్టమ్స్ అధికారులు. తనిఖీల్లో భాగంగా ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. షార్జా నుంచి చెన్నై వచ్చిన ప్రయాణికులు డ్రగ్స్ సరఫరా చేస్తునట్టు సమాచారం అందడం తో కస్టమ్స్ అధికారులు మరింత విస్తృత తనిఖీలు జరిపారు. కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ సీన్‌ వెలుగు చూసింది. కడుపులో కిలో లెక్కన హెరాయిన్‌ని క్యాప్సల్స్‌ రూపంలో తరలిస్తున్న ముఠాను గుర్తించారు. వారి నుంచి వైద్యాధికారుల ఆధ్వర్యంలో మొత్తం హెరాయిన్‌ని బయటకు తీయించారు. పట్టుబడ్డ హెరాయిన్‌ విలువ సుమారు రూ.7కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్మగ్లింగ్‌ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండిః

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట థియేటర్‌లో ప్రేక్షకుల ఆందోళన.. టికెట్‌ డబ్బులు వాపస్‌ చేసిన యాజమాన్యం

Cyclone Asani : అసని పంజాతో రైతుగుండె చెరువు.. ఉప్పు మొదలు పప్పు, బియ్యం వరకు ఊడ్చేసింది..