మళ్లీ తెరపైకి లారెన్స్‌ బిష్టోయ్‌ గ్యాంగ్‌.. ఏకంగా సమాజ్‌వాదీ పార్టీ నేతకే వార్నింగ్!

లారెన్స్‌ బిష్టోయ్‌ గ్యాంగ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. గతేడాది మహారాష్ట్రలోని అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎన్సీపీ నేతను అత్యంత దారుణంగా హత్య చేసిన బిష్టోయ్‌ ముఠా.. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ నేత తారిఖ్‌ఖాన్‌కు కాల్ చేసి బెదిరించడం సంచలనం రేపుతోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తారిఖ్‌ఖాన్‌కు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మళ్లీ తెరపైకి లారెన్స్‌ బిష్టోయ్‌ గ్యాంగ్‌.. ఏకంగా సమాజ్‌వాదీ పార్టీ నేతకే వార్నింగ్!
Threat Call To Tariq Khan

Updated on: Mar 31, 2025 | 8:36 AM

గతేడాది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన బిష్ణోయ్ గ్యాంగ్‌.. ఇప్పుడు మరో హత్యకు ప్లాన్ చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిష్ణోయ్‌ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రతినిధి తారిఖ్‌ఖాన్ వెల్లడించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. గత రెండు నెలలుగా బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి ఫోన్‌కాల్స్‌తో బెదిరింపులకు పాల్పడుతున్నా పట్టించుకోలేదన్నారు. కానీ.. ఇప్పుడు మరోసారి కాల్‌ చేసిన కొందరు వ్యక్తులు.. తాము చంపబోయేవారి జాబితాలో నెక్ట్స్‌ నువ్వే ఉన్నవంటూ బెదిరించారని.. రెండు రోజులు ఆగితే ఏం చేస్తామో తెలుస్తోందని వార్నింగ్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి, పార్టీ చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌కు తెలియజేసినట్లు తెలిపారు.

ఇక.. తారిఖ్‌ఖాన్‌ కామెంట్స్‌పై స్పందించిన పోలీసు సూపరింటెండెంట్ రామానంద్ ప్రసాద్.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిజంగానే బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఈ కాల్‌ చేసిందా.. లేక సైబర్‌ నేరగాళ్ల పనా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని, తారిఖ్‌ఖాన్‌కు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌కు పలుమార్లు బెదిరింపులు ఎదురయ్యాయి. సల్మాన్‌ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేశారు. అయితే.. లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నప్పటికీ.. తన గ్యాంగ్‌తో టచ్‌లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీపై ఇలానే దాడి చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..