మళ్లీ తెరపైకి సాయి జన్మస్థల వివాదం..!

| Edited By:

Feb 09, 2020 | 4:56 PM

గత నెల ముగిసినట్లుగానే కనిపించిన సాయి బాబా జన్మస్థల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. బాబా జన్మించిన స్థలంగా పేరొందిన పత్రిలో సాయి బాబా ఆలయం నిర్మించాలని సాయి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సేలూ నుంచి పత్రి వరకు సాయి భక్తులు ర్యాలీ చేశారు. అయితే సాయిబాబా జన్మించిన పత్రిని అభివృద్ధి చేస్తామని జనవరిలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. ఇందుకోసం రూ.100కోట్లు విడుదల చేసి.. అక్కడ ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన అన్నారు. […]

మళ్లీ తెరపైకి సాయి జన్మస్థల వివాదం..!
Follow us on

గత నెల ముగిసినట్లుగానే కనిపించిన సాయి బాబా జన్మస్థల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. బాబా జన్మించిన స్థలంగా పేరొందిన పత్రిలో సాయి బాబా ఆలయం నిర్మించాలని సాయి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సేలూ నుంచి పత్రి వరకు సాయి భక్తులు ర్యాలీ చేశారు. అయితే సాయిబాబా జన్మించిన పత్రిని అభివృద్ధి చేస్తామని జనవరిలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. ఇందుకోసం రూ.100కోట్లు విడుదల చేసి.. అక్కడ ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన అన్నారు. దీంతో షిర్డీ వివాదం మొదలైంది.

బాబా జన్మస్థలంగా పత్రిని ప్రకటించి, అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాశస్త్యం తగ్గిపోతుందని.. షిర్డీ గ్రామ ప్రజలతో పాటు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఆలయ ట్రస్టు ప్రతినిధులతో ఉద్దవ్ ఠాక్రే భేటీ అయ్యారు. ఆ తరువాత ఆ పార్టీ నాయకుడు కమలాకర్ కోఠే మాట్లాడుతూ.. ఇకపై బాబా జన్మస్థలంగా పత్రిని పేర్కొనేది లేదని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ వివాదం కాస్త అప్పుడు సద్దుమణిగింది. అయితే తాజాగా పత్రిలో బాబా ఆలయాన్ని నిర్మించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.