
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కవిత్వంపై చేసిన తొలి స్పోకెన్ ఆల్బమ్, ఎటర్నల్ ఎకోస్‌ను ఆవిష్కరించారు. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు సద్గురు.
A poem is a piece of one’s Heart, hope your heart beats with these Eternal Echoes and know the rhythm of mine. – Sg #EternalEchoeshttps://t.co/cUeSgK17RN pic.twitter.com/32aazsm7dK
— Sadhguru (@SadhguruJV) August 23, 2024
‘ఒకరి మనసు లోతుల్లో నుంచి వచ్చిన మాటలు కవితకు రూపంలా మారుతాయి. ఈ ఎటర్నల్ ఎకోస్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. నా మనసు లోతులను మీకు తెలియజేస్తుంది’ అని సద్గురు ట్వీట్‌లో పేర్కొన్నారు. గ్రామీ అవార్డు విన్నర్ కోరీ హెన్రీ, గ్రామీ అవార్డు నామినీ జే డీల్, ఇషా ఫౌండేషన్ దేశీయ బ్యాండ్ – సౌండ్స్ ఆఫ్ ఇషా, కర్నాటిక్ శాస్త్రీయ గాయకుడు సందీప్ నారాయణ్, ఎఫర్ట్‌లెస్ ఆడియో కలిసి సంయుక్తంగా ఈ ఆల్బమ్ కోసం పని చేశాయి.
16-ట్రాక్‌లతో కూడిన ఈ ఆల్బమ్ వరల్డ్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్, ఆల్టర్నేటివ్ జాజ్, యాంబియంట్ సౌండ్‌ల కలయికతో అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎదుర్కున్న అనేక మానవ అనుభవాలను.. జనాలందరూ ఈ ఆల్బమ్ ద్వారా మళ్లీ స్మృశించవచ్చు. ఈ ఆల్బమ్ ఇప్పుడు Spotify, Apple Music, Amazon Music, Jio Saavn, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆల్బమ్ వినడానికి, సందర్శించండి: https://monkmusic.link/eternalechoes
మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి 91 94874 75346కి కాల్ చేయండి
అభిప్రాయాలను mediarelations@ishafoundation.orgకు రాయండి..