శబరిమలలో మహిళల ప్రవేశంపై.. సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు..

| Edited By:

Dec 06, 2019 | 1:19 AM

కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. గతేడాది 2018లో అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చు అంటూ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే గురువారం తెలిపారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి విస్తృత ధర్మాసనం చూస్తోందని సుప్రీం పేర్కొంది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే సమయంలో బిందు అమ్మిని అనే మహిళను అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే […]

శబరిమలలో మహిళల ప్రవేశంపై.. సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు..
Follow us on

కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. గతేడాది 2018లో అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చు అంటూ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే గురువారం తెలిపారు.

ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి విస్తృత ధర్మాసనం చూస్తోందని సుప్రీం పేర్కొంది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే సమయంలో బిందు అమ్మిని అనే మహిళను అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆ మహిళ సుప్రీం మెట్లెక్కింది. ఈ పిటిషన్‌పై సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ గురువారం వాదనలు వినిపించారు. 2018 సుప్రీం ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ.. ఆమెపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. 2018లో ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదని.. దీని పరిశీలనకు ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశామని పేర్కొంది. విచారణ ముగిసిన తర్వాత.. ఈ బెంచ్‌ తుది తీర్పు వెలువరిస్తుందని.. ప్రస్తుతం ఎలాంటి తుది నిర్ణయాలు లేవని ఈ సందర్భంగా బెంచ్‌ తెలిపింది.