Covid Effect On Shabarimala: శబరిమలలో మకరసంక్రాంతి రోజున జ్యోతి దర్శనానికి భక్తుల సంఖ్యపై క్లారిటీ

|

Jan 05, 2021 | 6:48 PM

శబరిమ అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తులకు శబరిమల అయ్యప్పస్వామి ఆలయ కమిటి నిర్వహకులు క్లారిటీ... జ్యోతి దర్శం ఇచ్చే రోజు భక్తులు ముందుగా ...

Covid Effect On Shabarimala: శబరిమలలో మకరసంక్రాంతి రోజున జ్యోతి దర్శనానికి భక్తుల సంఖ్యపై క్లారిటీ
Follow us on

Covid Effect On Shabarimala: హిందువులకు పవిత్రమైన మకరసంక్రాంతి వస్తుంది.. దీంతో అయ్యప్ప భక్తులు కేరళలోని శబరిమలకు పయణంకావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కన్నెస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు శబరిమల అయ్యప్పస్వామి ఆలయ కమిటి నిర్వహకులు క్లారిటీ ఇచ్చారు. మకరవిలక్కు ప్రత్యేక పూజలకు, సంక్రాంతి పండుగ రోజు, అయ్యప్పస్వామి జ్యోతి దర్శం ఇచ్చే రోజు భక్తులు ముందుగా అనుమతి తీసుకోవాలని తెలిపింది. అలా అనుమతులు తీసుకున్న భక్తులకు మాత్రమే శబరిమలలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని ప్రకటించింది. మకరవిలక్కు సందర్బంగా అనుమతి లేని ఏ ఒక్క భక్తుడు స్వామి సన్నిధానంలోకి ప్రవేశించడానికి అవకాశం లేదని ట్రావెన్స్ కోర్ అధికారులు స్పష్టం చేశారు.

ఇప్పటికే మకరవిలక్కు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ 19 నేపథ్యంలో మకరవిలక్కు యాత్రకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం అనేక నియమ నిబంధనలు విధించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో సహ దేశంలోని వివిద రాష్ట్రాలకు చెందిన అయ్యప్పస్వామి భక్తులు సంక్రాంతి రోజు శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని జ్యోతి దర్శనం చేసుకోవడానికి ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అలా టికెట్ ఉన్నవారు మాత్రమే శబరిమల రావాలని ఆలయకమిటీ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. అయితే మకర సంక్రాంతి ఉత్సవాల సందర్బంగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను ఇప్పటికే 5,000కు పెంచారు. అయితే మకరవిలక్కు యాత్రలో ముఖ్యమైన సంక్రాంతి రోజున 5 వేల మంది భక్తుల కంటే ఏ ఒక్కరు సన్నిధానంలో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వడం లేదని పక్కా క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికే అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడి సహా సన్నిధానంలో 27 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆలయ అధికారులు అలెర్ట్ అయ్యారు. భక్తుల రాకకు ఆంక్షలు విధిస్తూ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం శబరిమలలో ఉన్న అయ్యప్ప భక్తులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కరోనా పరీక్షలు కఠినతరం చేశామని అధికారులు చెప్పారు.

Also Read :
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. మకరసంక్రాంతి రోజు నుంచి కుంభమేళా ప్రారంభం..