Modi-Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఈ భేటీలో రష్యా-భారత్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడేందుకు ఈ భేటీ దోహదం చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య 10 కీలక ఒప్పందాలపై సంతకాలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. పర్యావరణ, రక్షణ, వాణిజ్యం సహా ఇతర రంగాలకు చెందిన ఒప్పందాలపై సంతకాలు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇరు దేశాల రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల మంత్రులు కూడా సోమవారం భేటీ కానున్నారు.
అలాగే భారత్ ఎంతగానో ఎదురు చూస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400ను మరింత వేగంగా అందించాలని భారత్ రష్యాను కోరే అవకాశం ఉంది. దీని సరఫరా ఇప్పటికే ప్రారంభం కాగా, కొనుగోలు విషయంలో ఇండియాపై అమెరికా అంక్షలు విధించే అవకాశం ఉంది. కానీ రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన విధానం వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి ద్వారా ఉంటుందని ఆమెరికాకు ఇండియా స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా-భారత్ మధ్య సంబంధాల్లో బంధం బలపడాలంటే పుతిన్ రాక ఎంతో కీలకం కానుంది.
రష్యా అధ్యక్షుడి షెడ్యూల్ ఇలా..
10:30AM: ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం మరియు చర్చలు.
10.30AM: ఇద్దరు రక్షణ మంత్రుల మధ్య సమావేశం మరియు చర్చలు
11.30AM: భారతదేశం-రష్యా మధ్య మొదటి 2+2 సంభాషణ, దీనిలో ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల ప్రతినిధి బృందం చర్చలు.
3-4 PM: వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక విమానం ఢిల్లీ చేరుకుంటుంది.
సాయంత్రం 5: హైదరాబాద్ హౌస్‌లో మోదీ-పుతిన్ భేటీ
5:30 PM: మోడీ-పుతిన్ చర్చలు ప్రారంభం
7.30PM: డిన్నర్
8-9PM ఉమ్మడి ప్రకటన విడుదల
9.30PM – పుతిన్ రష్యాకు బయలుదేరుతారు
అయితే దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు పుతిన్ అక్కడే ఉంటారు. ప్రారంభ వ్యాఖ్యలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కెమెరాలో ఉమ్మడి మీడియా ప్రకటన ఉండదు. కెమెరామెన్ ఎంట్రీ మాత్రమే ఉంటుంది.
ఇవి కూడా చదవండి: