Russia – Ukraine War: ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ యువతి.. ఎందుకోసమంటే..!

|

Mar 12, 2022 | 6:35 AM

Russia - Ukraine War: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. 16 రోజులుగా సాగుతున్న ఈ భీకర యుద్ధం ముగిసేదెన్నడో కానీ..

Russia - Ukraine War: ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ యువతి.. ఎందుకోసమంటే..!
Pak Youth
Follow us on

Russia – Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. 16 రోజులుగా సాగుతున్న ఈ భీకర యుద్ధం ముగిసేదెన్నడో కానీ.. ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీ పౌరులు నరకం అనుభవిస్తున్నారు. ఆ దేశంలో ఉండలేక, వదలి వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో పలు దేశాలు తమ దేశాలకు చెందిన పౌరులను అక్కడి నుంచి తరలించేందుకు ప్రత్యేక ఆపరేషన్స్ చేపట్టాయి. మన దేశం కూడా ఆపరేషన్ గంగ పేరుతో ఆపరేషన్ చేపట్టింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది. అయితే, ఈ ఆపరేషన్‌లో భాగంగా భారతీయులనే కాకుండా పొరుగు దేశాలకు చెందిన వారిని కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు అధికారులు. నేపాల్ ప్రభుత్వం తమ దేశ పౌరులను తరలించడంలో సహకరించాలంటూ భారత్‌ను వేడుకున్న విషయం తెలిసిందే. ఇదే మాదిరిగా పలు దేశాలు కూడా భారత్‌ను కోరాయి. అయితే, తాజాగా ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో చిక్కుకుపోయిన పాకిస్తాన్ యువతిని ఇండియన్ అధికారులు రక్షించారు. కైవ్ నుంచి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లేందుకు ఇండియన్ ఎంబసీ అధికారులు పాక్ యువతి అస్మా షఫీక్‌కు సహకరించారు.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాకిస్తాన్ యువతి.. భారత అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ‘అత్యంత క్లిష్ట పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి సహాయం చేసినందుకు భారత రాయబార కార్యాలయం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’ తెలుపుతూ అస్మా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసింది. ‘‘మేము చాలా కష్టాల్లో చిక్కుకుపోయాము. ఇలాంటి సమయంలో మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నందుకు కైవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగే భారత ప్రధాని మోదీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేమంతా సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాము.’’ అని ఆ వీడియోలో పేర్కొంది. కాగా, అస్మా షేక్ భారతీయులతో కలిసి ఉక్రెయిన్ రాజధాని కైవ్ నుంచి పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్తోంది. ఆమె త్వరలోనే తన కుటుంబ సభ్యులను కలవనుంది.

ఇదిలాఉంటే.. భారత అధికారులు ఒక బంగ్లాదేశీయుడిని కూడా తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు.. ఆపరేషన్ గంగ కింద.. ఒక నేపాలీ పౌరుడిని కూడా తరలించారు. ఇతనితో పాటు మరో ఏడుగురు నేపాలీలను భారత అధికారులు ఉక్రెయిన్ నుంచి ఇండియాకు తీసుకువస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.

Also read:

Viral Video: ఈ తిమింగలం వెరీ స్పెషల్ గురూ.. అడిగి మరీ ముద్దు పెట్టించుకుంటుంది..!

Viral Video: యజమాని కోసం ఇంజనీర్‌గా మారిన కుక్క.. వైరల్ అవుతున్న అద్భుతమైన వీడియో..!

Flying Object: క్రొయేషియాలో కుప్పకూలిన వింత వస్తువు.. కూలిన చోట భారీ గొయ్యి.. UFO అంటూ అనుమానాలు..!