Sputnik V vaccine: మరికాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులు

|

May 01, 2021 | 3:07 PM

Sputnik V vaccine: దేశంలో కరోనావైరస్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు నుంచి దేశ్యాప్తంగా 18 ఏళ్లకు పైబడిన వారందరికీ

Sputnik V vaccine: మరికాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులు
Sputnik V vaccine
Follow us on

Sputnik V vaccine: దేశంలో కరోనావైరస్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు నుంచి దేశ్యాప్తంగా 18 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఈ తరుణంలో టీకాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ కొంతమేర ఉపశమనం కలుగనుంది. మరికాసేపట్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు రష్యా నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నాయి. తొలి విడతలో భాగంగా 1,50,000 డోసుల వ్యాక్సిన్లు వస్తున్నాయి. మరో విడతలో ఐదు మిలియన్ల వ్యాక్సిన్ డోసులు రానున్నాయి. ఈ మేరకు మాస్కో, న్యూఢిల్లీలలోని దౌత్య వర్గాలు ఈ వివరాలను వెల్లడించాయి.

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేశాయి. రష్యన్ సావరిన్ వెల్త్ ఫండ్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. అయితే.. ఈ టీకా భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన విషయం తెలిసిందే. అనంతరం వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీ కోసం డాక్టర్‌ రెడ్డీస్‌ రష్యాతో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ఈ టీకాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌కు అప్పగించనున్నారు.

భారత్‌లో ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు అందుబాటులో ఉన్నాయి. కాగా, రష్యా నుంచి భారీ సంఖ్యలో డోసులు రానున్నటంతో దేశంలో టీకా పంపిణీని వేగవంతం అయ్యేలా కనిపిస్తోంది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు వేసుకోవలసి ఉంటుంది. కాగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 28న రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో సుదీర్ఘంగా సంభాషించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వ్యాక్సిన్లను భారత్‌కు ఇవ్వనున్నట్లు పుతిన్ వెల్లడించారు.

Also Read:

Corona Vaccine: కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ v వ్యాక్సిన్ల మధ్యగల తేడాలు, పోలికలు ఎంటో తెలుసా.. నిపుణుల సూచనలు..

గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు విడుదల..! గత నెలతో పోల్చితే తగ్గుదల.. ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే..!