పుతిన్ ప్రధాని మోడీకి ఫోన్.. ట్రంప్ తో సమావేశం సహా పలు విషయాలను వివరించిన రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీకి ఫోన్ చేసి అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తన సమావేశం గురించి తెలియజేశారు. ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో పుతిన్ ఇప్పుడు ప్రధాని మోడీతో ఫోన్ చేసి మాట్లాడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం మద్దతు ఉంటుందని మోడీ పునరుద్ఘాటించారు.

పుతిన్ ప్రధాని మోడీకి ఫోన్.. ట్రంప్ తో సమావేశం సహా పలు విషయాలను వివరించిన  రష్యా అధ్యక్షుడు
Russia Putin Andl Pm Modi

Updated on: Aug 18, 2025 | 6:40 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో, శుక్రవారం అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన సమావేశంలో చర్చించిన విషయాలను పుతిన్ నరేంద్ర మోడీకి తెలియజేశారు. ఈ రాత్రి యూరోపియన్ నాయకులు జెలెన్స్కీతో కలిసి వాషింగ్టన్‌లో ట్రంప్‌ను కలవబోతున్న నేపధ్యంలో పుతిన్ ఇప్పుడు మోడీకి చేసిన ఫోన్ కాల్ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

ప్రధాని మోడీ తనకు పుతిన్ చేసిన ఫోన్ కాల్ గురించి, అందులో అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన సమావేశం గురించి సమాచారాన్ని పంచుకున్న విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. తన స్నేహితుడైన  అధ్యక్షుడు పుతిన్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం నిరంతరం పిలుపునిచ్చింది.. ఈ విషయంలో చేసే అన్ని ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తామని చెప్పారు.

భారతదేశం  వైఖరిని ప్రధాని మోడీ చెప్పారు
ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం దృఢమైన వైఖరిని కలిగి ఉందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ విషయంలో చేసే అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. మరింత సన్నిహితంగా ఉండాలని మోడీ, పుతిన్ ఇద్దరూ అంగీకరించారు.

ప్రధాని మోడీకి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?

యూరోపియన్ నాయకులు ఈ రాత్రి వాషింగ్టన్‌లో జెలెన్స్కీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలుస్తున్నారు. భారతదేశం, రష్యా స్నేహం, వాణిజ్య సహకారం కారణంగా…  అమెరికా ఇటీవల భారతదేశంపై భారీ సుంకాలను విధించింది. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య శాంతి నెలకొంటే.. భారతదేశంపై విధించిన ఈ సుంకాల కూడా తెరపడవచ్చు. భారతదేశం రష్యాకు పెద్ద భాగస్వామి.. మంచి మిత్రదేశం కనుక ఈ  సమావేశం తర్వాత యూరోపియన్ నాయకులు తీసుకున్న నిర్ణయం రష్యాతో పాటు భారతదేశంపై కూడా ప్రభావం చూపిస్తుంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..