పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రభస.. ఐటీ శాఖ మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ

| Edited By: Phani CH

Jul 22, 2021 | 5:02 PM

గాసస్ వివాదంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు ప్రభుత్వంపై విరుచుకపడుతున్నారు. వీరి నిరసనలతో లోక్ సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి.

పార్లమెంట్ లో పెగాసస్ పై రభస.. ఐటీ శాఖ మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
Parliament
Follow us on

గాసస్ వివాదంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు ప్రభుత్వంపై విరుచుకపడుతున్నారు. వీరి నిరసనలతో లోక్ సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. పెగాసస్ అంశంపై గురువారం మూడో రోజు కూడా వీరు ప్రభుత్వాన్ని నిలదీయగా.. ఈ రోజు మీడియా సంస్థల కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడులను ఖండించారు. రాజ్యసభలో వీరు నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకుపోయారు. ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్..పెగాసస్ పై ప్రకటన చదవడానికి లేవగానే తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు శంతను సేన్ ఆయన చేతి నుంచి పేపర్లనులాక్కుని చించి వేశారు. ఆ ముక్కలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పై విసిరివేశారు. దీంతో అశ్విని వైష్ణవ్ ప్రకటన చదవలేక మిగిలిన కాగితాలను టేబుల్ పై ఉంచేశారు. ఈ గందరగోళంతో రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ రోజున సభ ఇలా వాయిదా పడడం ఇది మూడోసారి. మొదట మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తరువాత 2 గంటలకు వాయిదా పడింది. చివరకు పరిస్థితి ఏ మాత్రం మారకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

పెగాసస్ వివాదాన్ని ప్రభుత్వం తేలిగ్గా పరిగణిస్తోందంటూ ప్రతిపక్ష సభ్యులు చేత ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. మొదట తమ సీట్లలో కూర్చోవలసిందిగా సభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక లోక్ సభలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉదయం కనిపించింది. ప్రశ్నోత్తరాల సమయం కేవలం 12 నిముషాలపాటు మాత్రమే కొనసాగింది. వివాదాస్పద మూడు రైతు చట్టాలపై కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయగా పెగాసస్ అంశాన్ని లేవనెత్తుతూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ పోడియం వద్ద చేరి నినాదాలు చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్వయంగా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లోక్ సభ కూడా కొద్దీ సేపు వాయిదాలు పడుతూ వచ్చింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఇండియాలో భారీ వర్షాలు, వరదలు.. కుండ పోత.. గల్ఫ్ లో మండుతున్న ఎండలు.. ఉక్కపోత

Locked Season 2: మ‌రోసారి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న `ఆహా`