PM-KISAN Scheme: పీఎం-కిసాన్‌ పథకంలో రైతుల ఖాతాల్లోకి రూ.1.15 లక్షల కోట్లు బదిలీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

PM-KISAN Scheme: పీఎం-కిసాన్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.1.15 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం వల్ల పది కోట్ల...

PM-KISAN Scheme: పీఎం-కిసాన్‌ పథకంలో రైతుల ఖాతాల్లోకి రూ.1.15 లక్షల కోట్లు బదిలీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

Updated on: Feb 25, 2021 | 1:02 AM

PM-KISAN Scheme: పీఎం-కిసాన్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.1.15 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం వల్ల పది కోట్ల మంది రైతులు లబ్దిపొందినట్లు తెలిపింది. అయితే అర్హత కలిగిన రైతులందరినీ ఈ పథకంలో చేర్చాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర సూచించింది. పీఎం-కిసాన్‌ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ వివరాలను వెల్లడించారు.

2019లో పీఎం- కిసాన్‌ పథకం ప్రారంభం:

కాగా, రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు 2019 ఫిబ్రవరిలో ఈ పీఎం-కిసాన్‌ పేరుతో పథకం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దీని కింద ఏడాదికి రూ.6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోనే మూడు దఫాల్లో జమ చేస్తోంది. ఈ పథకం ద్వారా 10.75 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందగా, ఇప్పటి వరకు రూ.1.15 లక్షల కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ థోమర్‌ తెలిపారు. దాదాపు 14.5 కోట్ల మంది రైతులకు పీఎం-కిసాన్‌ ద్వారా ప్రయోజనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మరింత మంది లబ్దిదారులను చేర్చేందుకు ప్రయత్నాలుచే చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

అర్హులైన రైతులను ఈ పథకంలో చేర్చేలా రాష్ట్రాలకు ఆదేశం:

కాగా, ఈ పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులను చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన రైతులను ఈ పథకంలో చేర్చాలని కేంద్రం సూచించింది. ఈ పథకం కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిందని, అందుచేత ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకంలో పశ్చిమబెంగాల్‌ చేరనప్పటికీ లబ్దిదారుల సమాచారాన్ని కేంద్రానికి అందించిన అనంతరం వారికి కూడా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలోనూ వ్యవసాయ రంగం రాణించిందని కేంద్ర మంత్రి అన్నారు.