Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. సిమెంట్‌ లోడ్‌ లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం

|

Jun 21, 2021 | 9:47 AM

Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల వల్ల..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. సిమెంట్‌ లోడ్‌ లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం
Road Accident
Follow us on

Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సోమవారం కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కోజికోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సిమెంట్‌ లోడ్‌తో వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం కోజికోడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, ప్రమాదాలు పెరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వాహన డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటం, అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం తాగి నడపడం వల్ల అమాయకులు బలవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి వ్యక్తికి ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇవీ కూడా చదవండి:

Road Accident: టిప్పర్‌ను ఢీకొట్టిన పెళ్లి లారీ.. 20 మందికి గాయాలు.. నలుగురికి..

Murder: దారుణం.. ఆ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి ప్లాన్.. భర్తను కడతేర్చిన భార్య!