రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆర్జేడీ అధ్యక్షుడు.. నితీశ్ కుమార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తేజస్వీ యాదవ్

|

Dec 06, 2020 | 5:46 PM

రైతు వ్యతిరేక చట్టాలపై ఢిల్లీలో పది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు బిహార్ ప్రతిపక్ష నాయకుడు,

రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆర్జేడీ అధ్యక్షుడు.. నితీశ్ కుమార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తేజస్వీ యాదవ్
Follow us on

రైతు వ్యతిరేక చట్టాలపై ఢిల్లీలో పది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు బిహార్ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ మద్దతు తెలిపారు. డిసెంబర్‌ 8 న నిర్వహించే భారత్ బంద్‌కు సహకరిస్తామన్నారు. అంతేకాకుండా మహాకూటమి నేతలతో కలిసి బిహార్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ బిహార్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

దేశంలో పది రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తాము ప్రశాంతంగా సంఘీభావం తలుపుతుంటే ఓ పిరికిపంద ప్రభుత్వం మాపై కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా రైతుల కోసం ఉరికంభం ఎక్కడానికైనా సిద్దమని ప్రకటించారు. నిజంగా అధికారం మీ చేతిలో ఉంటే తనను అరెస్ట్ చేయండని, లేదంటే నేనే వచ్చి లొంగిపోతానని అన్నారు. రైతులకు మద్దతుగా నిలిచినందుకు తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రైతులతో మూడుసార్లు చర్చలు జరిపిన కేంద్రప్రభుత్వం ఈ నెల 9న మరోసారి చర్చలు జరపడానికి సిద్దమని ప్రకటించిన సంగతి తెలిసిందే.