వాహనదారులకు షాక్.. మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజులుగా పైపైకి.. ఈసారి ఎంతంటే..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాకిస్తున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా దేశ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.

వాహనదారులకు షాక్.. మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజులుగా పైపైకి.. ఈసారి ఎంతంటే..
Follow us
Rajitha Chanti

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 06, 2020 | 6:38 PM

Delhi: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాకిస్తున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా దేశ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్ పై రూ.28 పైసలు, డీజిల్ పై రూ.29 పైసలు పెంచుతూ అదివారం ఆయిల్ సంస్థలు ప్రకటించాయి. విదేశీ మారకపు రేటు, అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఇంధన ధరలను పెంచాయి. దీంతో ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.41, లీటర్ డీజిల్ ధర రూ.73.61కు చేరింది. అటు ముంబయిలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.90.5, డీజిల్ ధర రూ.89.78కు చేరింది.

దేశవ్యాప్తంగా నవంబర్ 20 నుంచి ఇప్పటివరకు 14సార్లు ఇంధన ధరలు పెరిగాయి. 2018 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తారస్థాయిని తాకాయి. అంతేకాకుండా 17 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్ పై రూ.2.35, లీటర్ డీజిల్ పై రూ.3.15 వరకు పెంచినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‏లో ముడి ఇంధనం పై 34 శాతం డిమాండ్ పెరగడంతో అక్టోబర్ 30న 36.9 యూఎస్ డాలర్లుగా ఉన్న బ్యారెల్ ధర డిసెంబర్ 4 నాటికి 49.5 డాలర్లకు చేరింది.