PM Modi: అటల్‌ సేతును ప్రారంభించిన ప్రధాని.. ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వడం ఖాయం.

|

Jan 12, 2024 | 4:42 PM

ఇక ఈ బ్రిడ్జ్‌ని ముంబై ట్రాన్స్ హార్బ‌ర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు. సుమారు 21.8 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ నిర్మాణానికి సుమారు రూ. 17,840 కోట్లు ఖర్చైంది. ద‌క్షిణ ముంబై నుంచి న‌వీ ముంబైని ఈ బ్రిడ్జ్ అనుసంధానం చేస్తుంది. ఇప్పటి వరకు రెండున్నర గంటలు..

PM Modi: అటల్‌ సేతును ప్రారంభించిన ప్రధాని.. ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వడం ఖాయం.
Atal Setu
Follow us on

దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్ బిహారి వాజ్‌పేయి సెవ్రి- న్వశేవ అటల్ సేతు’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శుక్రవారం నేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ అద్భుత నిర్మాణం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి దేశానికి సేవలకు గుర్తుగా ఈ వంతెనకు అటల్‌ సేతు అని నామకరణం చేశారు.

ఇక ఈ బ్రిడ్జ్‌ని ముంబై ట్రాన్స్ హార్బ‌ర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు. సుమారు 21.8 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ నిర్మాణానికి సుమారు రూ. 17,840 కోట్లు ఖర్చైంది. ద‌క్షిణ ముంబై నుంచి న‌వీ ముంబైని ఈ బ్రిడ్జ్ అనుసంధానం చేస్తుంది. ఇప్పటి వరకు రెండున్నర గంటలు పట్టే ప్రయాణ సమాయం ఈ బ్రిడ్జికి అందుబాటులోకి రావడంతో కేవలం 20 నిమిషాలే పట్టడం విశేషం.

ఇక ఈ బ్రిడ్జిని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. వాహన దారుల భద్రత కోసం బ్రిడ్జిపై ఏకంగా 400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుంది. ఇక ఈ బ్రిడ్జి దక్షిణ ముంబైలోని సెవ్రి నుంచి ప్రారంభమై ఎలిఫెట్ ఐలాండ్‌కు ఉత్తరాన థానే క్రీక్‌ను దాటి న్హావా సమీపంలోని చిర్లే గ్రామంలో ముగుస్తుంది. ముంబయి విమానాశ్రయం, నవీ ముంబయి అంతర్జాతీయ విమానాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఈ బ్రిడ్జిపై వాహనాలు గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లొచ్చు.

ఆకట్టుకుంటోన్న వీడియో..

ఇదిలా ఉంటే అటల్‌ సేతు బ్రిడ్జి ప్రారంభానికి ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జిపై గురువారం రాత్రం ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ రిహార్సల్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్‌ సహాయంతో తీసిన వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాత్రి పూట విద్యుత్‌ దీపాల వెలుగులో బ్రిడ్జ్‌ అద్భుతంగా కనిపించింది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..