‘డ్రగ్స్ తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు చెబుతాం’, రియా చక్రవర్తి

సుశాంత్ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీల బండారాలు బయటపడబోతున్నాయి. మత్తుమందులకు అలవాటు పడిన సుమారు పాతిక మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను వెల్లడిస్తామని రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ తెలిపారు.

డ్రగ్స్ తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు చెబుతాం, రియా చక్రవర్తి

Edited By:

Updated on: Sep 08, 2020 | 2:58 PM

సుశాంత్ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీల బండారాలు బయటపడబోతున్నాయి. మత్తుమందులకు అలవాటు పడిన సుమారు పాతిక మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను వెల్లడిస్తామని రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ తెలిపారు. ఈ కేసులో తమను విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు వారీ విషయం చెబుతూ.. ఇది అందరికీ తెలిసింధే  అన్నారు. వీరిచ్ఛే సమాచారం మేరకు ఈ సంస్థ త్వరలో ఈ సెలబ్రిటీలకు సమన్లు పంపడానికి రెడీ అవుతోంది. ఈ సెలబ్రిటీల్లో నటీనటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఉన్నారని రిచా తెలిపింది.

అటు- సుశాంత్ కి డ్రగ్స్ తీసుకునే అలవాటు రియా అతని జీవితంలో ప్రవేశించక ముందు కూడా ఉండేదని ఆమె  తరఫు లాయర్ తెలిపారు. 2016-17 లో సుశాంత్ తన ‘కేదార్ నాథ్’ మూవీ షూటింగ్ సమయంలో కూడా డ్రగ్స్ తీసుకునేవాడని ఆయన చెప్పారు. నిజానికి తన క్లయింట్ రియా అతడి ఈ అలవాటును మాన్పించేందుకు ఎంతో కృషి చేసిందని ఆయన వెల్లడించారు.