సుశాంత్ సింగ్ కేసు, సత్యమే జయిస్తుంది, రియా చక్రవర్తి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆయన తండ్రి కేకే ఖాన్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ సహనటి రియా చక్రవర్తి మొదటిసారిగా ఈ వ్యవహారంపై స్పందించింది. (తన కుమారుడిని రియా చక్రవర్తి..

సుశాంత్ సింగ్ కేసు, సత్యమే జయిస్తుంది, రియా చక్రవర్తి

Edited By:

Updated on: Aug 01, 2020 | 11:38 AM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆయన తండ్రి కేకే ఖాన్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ సహనటి రియా చక్రవర్తి మొదటిసారిగా ఈ వ్యవహారంపై స్పందించింది. (తన కుమారుడిని రియా చక్రవర్తి ఛీట్ చేసిందని, వేధించిందని, అతని సూసైడ్ కి రియాయే కారణమని ఖాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే). అయితే ఈ ఆరోపణలను ఖండించిన  ఆమె.. కన్నీటి పర్యంతమవుతూ ఓ వీడియో విడుదల చేసి.. ‘సత్యమే జయిస్తుంది’ అని వ్యాఖ్యానించింది.  భగవంతుడి పట్ల, న్యాయవ్యవస్థ పట్ల తనకు ఎంతో విశ్వాసం ఉందని, తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆమె పేర్కొంది. ‘నాపై ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో వార్తలు, రూమర్లు వస్తున్నాయి. కానీ .. నా లాయర్ల సలహాపై వాటిమీద స్పందించడంలేదు… అని రియా వెల్లడించింది.

సుశాంత్ కేసు ముంబైలోనే కాక దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. దీనిపై ముంబై పోలీసులతో బాటు బీహార్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.