Pipad Village: ఎంత ఆస్థి ఉన్నా ఈ గ్రామంలో అబ్బాయిలను మేము పెళ్ళి చేసుకోము అంటున్న యువతులు.. రీజన్ వింటే షాక్..

ఈ గ్రామంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మాత్రమే కాదు, నివాసితులు మొబైల్ కనెక్టివిటీ కోసం  కూడా కుస్తీ పట్టుపట్టాల్సిందే. అంతేకాదు రేషన్ షాపు డీలర్లు తమ వద్ద ఉన్న పీఓఎస్ పరికరాలు ఉపయోగించుకునేందుకు సమీపంలోని గుట్టపైకి ఎక్కాలి.

Pipad Village: ఎంత ఆస్థి ఉన్నా ఈ గ్రామంలో అబ్బాయిలను మేము పెళ్ళి చేసుకోము అంటున్న యువతులు.. రీజన్ వింటే షాక్..
Rajasthan Pipad Village

Updated on: Apr 11, 2023 | 9:55 AM

ప్రపంచంలో మారు మూల గ్రామాలు కూడా ఆధునికత వైపు పయనిస్తున్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో తమని తాము అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఆ ఊరుకి ఏ అమ్మాయి అయినా వెళ్లాలంటే.. మాకు వద్దు అంటున్నాయి.   ఆ ఊరి అబ్బాయిలకు ఎంత చదువు, ఆస్తులు, డబ్బులున్నా మేము పెళ్లి చేసుకోము..అంటూ రిజెక్ట్ చేస్తున్నారు. అయితే ఇలా ఒకరినో, ఇద్దరినో కాదు.. కాదు అసలు ఆ ఊరిలో ఏ యువకులను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో పెళ్లికాని బ్రహ్మచారులు ఎక్కువ అవడంతో.. క్రమంగా ఆ గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు గ్రామస్థులు.. ఈ బ్రహ్మచారులు గ్రామంలో ఈ పరిస్థితి ఏర్పడానికి కారణం తెలిస్తే షాక్ తింటారు. ఎందుకంటే గ్రామంలో నెట్ సిగ్నల్స్ లేకపోవడమే అట.. ఈ గ్రామం రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ జిల్లాలో పీపడ్ గ్రామం.. వివరాలోకి వెళ్తే..

భారతదేశం వేగంతో డిజిటల్‌ యుగంగా మారుతున్న కాలంలో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం పోరాడుతున్న గ్రామాల్లో ఒకటి పిపర్ గ్రామం ఒకటి.  పీపడ్ గ్రామంలో అన్న ఆధునిక సౌకర్యాలున్నాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం మొబైల్ కంపెనీలు సెల్ టవర్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ సెల్ టవర్స్ మాత్రం గ్రామంలో సరిగ్గా పనిచేయడం లేదు.. ఎందుకంటే ఈ గ్రామ భౌగోళిక స్వభావం డిఫరెంట్ గా ఉంటుంది.. లోతట్టు ప్రాంతంలో ఉన్న పీపడ్ గ్రామంలో సిగ్నల్స్ అందుకనే రావడంలేదు. దీంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా తక్కువగా ఉండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే.. గ్రామస్థులు  ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందడానికి ప్రతిరోజూ 3 కి.మీ. నడవాలి. అంతేకాదు MNREGA ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న వారు తమ చెల్లింపులు పొందేందుకు ఆన్ లైన్ లో హాజరు వేయించుకోవాలన్నా.. జీతం తీసుకోవాలన్నా చాలా దూరం నడవాల్సిందే. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ మాత్రమే కాదు, నివాసితులు మొబైల్ కనెక్టివిటీ కోసం  కూడా కుస్తీ పట్టుపట్టాల్సిందే. అంతేకాదు రేషన్ షాపు డీలర్లు తమ వద్ద ఉన్న పీఓఎస్ పరికరాలు ఉపయోగించుకునేందుకు సమీపంలోని గుట్టపైకి ఎక్కాలి.

ఇవి కూడా చదవండి

కొన్నిసార్లు, నివాసితులు అంబులెన్స్ , వైద్య సహాయం కోసం కూడా కాల్ చేయలేరు. గర్భిణీ స్త్రీలు , అనారోగ్యంతో బాధపడుతున్నవారు చాలాసార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఇంటర్నటె సదుపాయం లేని ఆ గ్రామంలోని అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు అస్సలు ఇష్టపడటం లేదు. తమ పెళ్లి జరగాలంటే.. తప్పనిసరిగా సొంత ఊరుని విడిచి పెడుతున్నారు పెళ్లికావాల్సిన మగపిల్లలు. అంతేకాదు పెళ్లి చేసుకున్న యువతులు తమ పుట్టింటికి తీసుకుని వెళ్లిపోతున్నారు. లేదా ఇంటర్నెట్ ఉన్న గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఈ గ్రామం నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..