74వ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా కలర్‌ఫుల్‌గా జరిగాయి. కర్తవ్యపథ్‌లో త్రివర్ణ పతకాన్ని ఎగరువేశారు రాష్ట్రపతి ముర్ము. ఆత్మినిర్భర్ భారత్‌ను ప్రతిబింబిస్తూ రిపబ్లిక్‌డే పరేడ్ జరిగింది. వాఘా సరిహద్దులో బీటింగ్ ద రిట్రీట్ కార్యక్రమం ఆకట్టుకుంది.
దేశవ్యాప్తంగా 74వ రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి హోదాలో ముర్ము రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్ సిసి ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. ప్రధాని మోదీ డ్రెసింగ్ ఈ వేడుకల్లో ఆకర్షణగా నిలిచింది. రాజస్థానీ తలపాగా ధరించి వేడుకలకు హాజరయ్యారు మోదీ.
రాష్ట్రపతి ముర్ము త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆత్మనిర్భరభారత్- భారత శక్తి సామర్థ్యాలను చాటుతూ కర్తవ్యపథ్‌లో పరేడ్ కొనసాగింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు. గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈజిప్ట్ కంటింజెట్. ఈజిప్ట్ సైన్యంలోని కీలక విభాగాలకు చెందిన 144 మంది సైనికులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. భారత గణతంత్ర వేడుకల్లో ఈజిప్ట్ సైన్యం పాల్గొనడం ఇదే తొలిసారి. ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసి సమక్షంలో- రాష్ట్రపతి ముర్ముకి ఆ దేశ కంటింజెంట్ గౌరవ వందనం చేసింది.
ఆయుధాల ఎగుమతిదారుగా మారాలనుకుంటున్న భారత్- స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఆయుధాలను రిపబ్లిక్ పరేడ్‌లో ప్రదర్శించింది. బ్రహ్మోస్, ఆకాష్ క్షిపణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే MBT-అర్జున్, నాగ్ మిసైల్ సిస్టమ్, BMP-2 ట్యాంక్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్, K-9 వజ్ర వంటి ఆయుధవ్యవస్థలు భారత్ సత్తా చాటాయి.
రిపబ్లిక్‌డే వేడుకల్లో ఎయిర్‌ఫోర్స్ డ్రిల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రాఫెల్ యుద్ద విమానాలతో చేసిన నేత్ర డ్రిల్ కనువిందు చేసింది. ఆకాశంలో జాగ్వార్ యుద్ద విమానాలు చేసిన అమృత్ ఫార్మేషన్ కూడా అదరగొట్టింది. ఆరు జాగ్వార్ యుద్ద విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. అటు మిగ్ -29 యుద్ద విమానాలతో బాజ్ షో కూడా అందరిని ఆకట్టుకుంది.
గణతంత్ర వేడుకల్లో తొలిసారి గన్ శాల్యూట్ కోసం భారతీయ గన్‌ను వాడారు. ఇప్పటిదాకా బ్రిటన్‌కు చెందిన 25 పౌండర్ గన్స్‌ను వాడేవారు. ఈసారి తొలిసారిగా 105mm ఫీల్డ్ గన్‌ను వాడారు. దేశ సాంస్కతిక శకటాల ప్రదర్శన జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభల తీర్థం థీమ్‌తో శకటాన్ని ప్రదర్శించారు. ధాన్యాగారం అని పిలిచే ఏపీలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రభల తీర్థాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాకారుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
పాకిస్తాన్ సరిహద్దులో కూడా కలర్‌ఫుల్‌గా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అటారి సరిహద్దులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు బీఎస్‌ఎఫ్ జవాన్లు. పాక్ జవాన్లతో స్వీట్లు పంచుకున్నారు భారత జవాన్లు. అటారి బోర్డర్‌లో రిపబ్లిక్ డే వేళ బీటింగ్ ద రిట్రీట్ కార్యక్రమం కన్నులపండుగా జరిగింది.
Pictures from the Republic Day celebrations at Kartavya Path in New Delhi. pic.twitter.com/p9pXdYMwU3
— PMO India (@PMOIndia) January 26, 2023
Colours of India at Kartavya Path! pic.twitter.com/S7WCwXRxqk
— PMO India (@PMOIndia) January 26, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..