Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడం అంత సులభమేనా?.. అసలు ఏ రాష్ట్రంలో పెన్షన్ ఎలా..

|

Mar 02, 2022 | 6:41 AM

Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. సాధారణంగా ఇటువంటి సంస్కరణలను సమర్థించే నిపుణులకు కూడా పాత పెన్షన్ వ్యవస్థ పునరుద్ధరణతో ఏమి జరుగుతుందనే దానిపై కచ్చితంగా తెలియదు.

Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడం అంత సులభమేనా?.. అసలు ఏ రాష్ట్రంలో పెన్షన్ ఎలా..
Nps
Follow us on

Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. సాధారణంగా ఇటువంటి సంస్కరణలను సమర్థించే నిపుణులకు కూడా పాత పెన్షన్ వ్యవస్థ పునరుద్ధరణతో ఏమి జరుగుతుందనే దానిపై కచ్చితంగా తెలియదు. అన్నిటినీ మించిన పెద్ద ప్రశ్న ఏమిటంటే.. ప్రభుత్వం ఎక్కడి నుంచి దీనికోసం డబ్బు సమకూరుస్తుంది అనేది. నిజానికి బడ్జెట్‌లో పెరుగుతున్న పెన్షన్ల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేసింది. ఇప్పుడు మళ్ళీ పాత విధానానికి మారడం వల్ల పడే భారం విషయంలో ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల పెన్షన్ అవసరాలను తీర్చేందుకు రాష్ట్రాలు రూ. 4 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పైగా, ఇది రాష్ట్రాలకు అయ్యే మొత్తం అభివృద్ధియేతర వ్యయం రూ.12.44 లక్షల కోట్లలో మూడింట ఒక వంతు. ప్రతి సంవత్సరం రాష్ట్రాలు తాము తీసుకున్న రుణాలపై రూ.4 లక్షల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాయి.

ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభిస్తే తాజా రుణాలను పెంచడం వల్ల భారం మరింత పెరగనుంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఇది ఎన్నికల ప్రధాన అంశంగా మారింది. మధ్యప్రదేశ్, హర్యానాలలో కూడా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరిస్తే బడ్జెట్ ఏమవుతుందో ఊహించండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అధిక అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉదాహరణకు రాజస్థాన్ ప్రభుత్వ బడ్జెట్‌ను తీసుకోండి. ఈ రాష్ట్రం మొత్తం అప్పులు జీడీపీలో 40 శాతంగా ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేవలం రుణాలపై వడ్డీకే రూ.28వేలకు పైగా ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవల చేసిన ప్రకటన ఆర్థిక మంత్రిత్వ శాఖకు, ఆర్‌బిఐకి ఎందుకు తాజా తలనొప్పిని తెచ్చిపెట్టిందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ ప్రశ్నలలో దీని నొప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

1. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత ఏప్రిల్ 1 నుంచి ఆగిపోతుందా? అవును అయితే, ప్రతి నెలా స్టాక్ మార్కెట్, బాండ్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ఈ సహకారం మొత్తం కూడా తగ్గుతుంది. మరిన్ని రాష్ట్రాలు చేరినందున, అటువంటి ఆస్తి తరగతులలో ప్రతి నెలా పెట్టుబడి పెట్టే మొత్తం కూడా తగ్గుతుంది. అంటే ప్రభుత్వ రుణానికి సంబంధించిన ఒక రకమైన ఆదాయ వనరులకు తలుపులు మూసుకుపోతాయి.

2. రెండవ పెద్ద ప్రశ్న.. ఎన్‌పీఎస్‌లో జమ చేసిన సొమ్ము ఏమవుతుంది? ఎన్‌పీఎస్‌లో ఇచ్చిన సహకారాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? అలా చేయడం వల్ల, ఇది స్టాక్, బాండ్ మార్కెట్‌లలో అమ్మకానికి దారితీస్తుందా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 55 లక్షలకు పైగా ఖాతాలు ఎన్‌పీఎస్‌లో తెరిచారు. ఈ ఖాతాల నిర్వహణలో మొత్తం ఆస్తి లేదా AUM రూ. 3.54 లక్షల కోట్లు. సాధారణ భాషలో చెప్పాలంటే, ఇంత పెద్ద మొత్తంలో ప్రస్తుతం స్టాక్ , బాండ్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టారు.

3. మూడో ప్రశ్న.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడి నుంచి నిధులు సమకూరుస్తాయి? వారు రుణాలు తీసుకుంటారా లేదా కొత్త రకాల పన్నులు విధిస్తారా? ఈ రెండు సందర్భాల్లోనూ పౌరులపైనే భారం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్‌ విధానం అమలుపై ఎన్నికల్లో వాగ్దానాలు చేసే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంటుంది.

Also Read..

Russia-Ukraine war Effect: రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారత్ పై ఎంత.. వాణిజ్యంలో రెండు దేశాలు పరస్పరం ఎంతమేర ఆధారపడ్డాయి..

Gold Silver Price: మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు