కరోనా కారణంగా మీ ఫ్లైట్ జర్నీ ఆగిపోయిందా..? టికెట్ బుక్ చేసుకున్నాకా… విదేశాలకు వెళ్లేందకు రెడీ అయ్యాకా… లాక్‌డౌన్ వచ్చి మీ ప్రయాణం వాయిదా పడిందా..? లక్షలు పెట్టి కొన్న ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారా..? మరి టికెట్ కొనేందుకు మీరు ఖర్చు చేసిన పైసలు మీకు వచ్చాయా..? లేదా…? అయితే మీ కోసమే ఈ వార్త… సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా కేంద్ర విమానాయాన సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది. కరోనా కారణంగా టికెట్ క్యాన్సల్ చేసుకున్న ప్రయాణికుల పైసలు వారికి తిరిగి ఇచ్చేయాలని సూచించింది. విమానాలను నడిపే సంస్థలకు టికెట్ రేటులో మూడొంతుల్లో రెండు వంతుల పైసలు తిరిగి ఇచ్చేయాలని సూచించింది.
Pursuant to Hon’ble SC’s order on tkt refund, 74.3% of total 55,23,940 PNRs amounting to ₹3,200cr have been refunded. Rest are in process.
2,06,119 credit shells worth ₹219cr created by airlines with consent of passengers. MoCA is constantly monitoring the situation.— MoCA_GoI (@MoCA_GoI) December 11, 2020
కరోనా కారణంగా ప్రయాణం వాయిదా పడిన ప్రయాణికుల టికెట్ల మొత్తం 3,200 కోట్లని భారతీయ విమానాయన సంస్థ తెలిపింది. అందులో ఇండిగో సంస్థ చెల్లించాల్సిన మొత్తమే 1,000 కోట్లని తెలిపింది. అయితే ఇండిగో ఇప్పటికే ప్రయాణికులకు వారి టికెట్ నగదును తిరిగి ఇచ్చేస్తోందని తెలిపింది. కొంత మంది ప్రయాణికులు పాత టికెట్ నగదును తిరిగి మళ్లీ టికెట్ కొనేందుకు ఉపయోగించుకున్నారని, ఆ మొత్తం 219 కోట్లని తెలిపింది.