నోట్ల రద్దు భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపింది. దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ కి గురయ్యారు. అ తరువాత ముద్రించిన 2వేల నోటుపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ గడువు ఇచ్చింది. ఎవరి వద్దనైనా రూ.2వేల నోటు ఉంటే బ్యాంకుల్లో జమ చేయాలని సూచిందింది. దీంతో బ్లాక్ మనీకి చెక్ పెట్టవచ్చిన భావించింది కేంద్రం. ఇదంతా ఎలా ఉన్నా.. సామాన్యులు మొదటి సారి నోట్ల రద్దు సమయంలో పడినంత ఇబ్బందులు రూ. 2వేల నోటు రద్దు సమయంలో పడలేదు. దీనికి కారణం ఎవరి దగ్గరా పెద్దగా ఈ పెద్ద నోట్లు లేకపోవడమే.
అయితే తాజాగా రూ. 100 నోటు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒకరు వంద నోటుపై పోస్ట్ చేశారు. రానున్న రోజుల్లో పాత వంద నోట్లు రద్దవుతాయని దీనికి ఆర్బీఐ కొంత గడువు కూడా ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. 2024 మార్చి 31 వరకు మాత్రమే పాత వంద రూపాయల నోటు చలామణి అవుతుందని.. ఆ తరువాత నిషేధం విధిస్తున్నట్లు రాసుకొచ్చారు.
దీంతో కొందరు దుకాణదారులు పాత వంద నోట్లను తీసుకునేందుకు జంకుతున్నారు. పాత వంద నోట్లను రద్దు చేస్తూ ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్బీఐకి ట్యాగ్ చేశారు ఒకరు. దీనిపై స్పందించిన ఆర్బీఐ అలాంటి ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని బదులిచ్చింది. ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితిలో వంద నోట్లను రద్దు చేయబోమని తెలిపింది. దీంతో వంద నోట్లపై వస్తున్న వార్తలు అవాస్తవం అని తేలింది.
@RBI Today, in Ameerpet, Telangana, I encountered an issue where a Pani Puri vendor declined to accept a Rs. 100 note, Could you kindly provide clarification on whether there are any considerations or guidelines regarding the acceptance of such notes in the market? pic.twitter.com/x4c3ONhX0O
— Anil G (@anilbjpofficial) December 27, 2023
Yogesh Dayal, the spokesperson for RBI, dismissed the viral claims about the withdrawal of the old Rs 100 notes. https://t.co/sXbIBl92VC pic.twitter.com/SzSARAypZ5
— The Quint (@TheQuint) December 26, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..