రేవ్‌ పార్టీలో మత్తుమందుగా పాము విషం.. సప్లై చేసిన బిగ్‌బాస్‌ విన్నర్ సహా మరో ఐదుగురిపై కేసు నమోదు..

|

Nov 03, 2023 | 2:57 PM

ఎల్విష్ యాదవ్‌.. ఇప్పటి వరకు అందరికీ అతడు బిగ్ బాస్ విన్నర్ అని తెలుసు. కానీ ఇప్పుడు అతను రేవ్ పార్టీ ఆర్గనైజర్, డ్రగ్స్ డీలర్, పాము విషం సరఫరా చేసే వ్యక్తిగా  గుర్తింపు పొందాడు. రేవ్ పార్టీలో ఏ పాము విషాన్ని ఉపయోగించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ, పోలీసులు ఎల్విష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు. రేవ్‌ పార్టీలో 9 పాములు, 20 మిల్లీ లీటర్ల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రేవ్‌ పార్టీలో మత్తుమందుగా పాము విషం..  సప్లై చేసిన బిగ్‌బాస్‌ విన్నర్ సహా మరో ఐదుగురిపై కేసు నమోదు..
Snake poison
Follow us on

ఇప్పటి వరకు మీరు రేవ్ పార్టీలలో డ్రగ్స్ వాడకం గురించి వినే ఉంటారు. కానీ, ఇప్పుడు ఈ కల్చర్‌ మరింత ప్రమాదకరంగా మారింది.. ఓ రేవ్ పార్టీలో పాము విషాన్ని మత్తు కోసం వాడారు. సమాచారం తెలిసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. అయితే, ఇక్కడ మత్తు కోసం పాము విషాన్ని వాడిన వ్యక్తి మరెవరో కాదు, బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్ అని తేలింది. నోయిడాలోని సెవ్రాన్ బాంక్వెట్ హాల్‌లో జరిగిన రేవ్ పార్టీలో పాము విషాన్ని ప్రయోగించినందుకు యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం యూపీ పోలీసులు విస్తృతంగా వెతుకుతున్నారు. ఈ విషయాన్ని నోయిడా డీసీపీ తెలిపారు. ఎల్విష్ యాదవ్ కోసం మూడు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఎల్విష్ యాదవ్ తనను తాను నిర్దోషిగా ప్రకటించుకుంటూ ఒక వీడియోను విడుదల చేశాడు. తన పేరును కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాడు.

ఎల్విష్ యాదవ్‌.. ఇప్పటి వరకు అందరికీ అతడు బిగ్ బాస్ విన్నర్ అని తెలుసు. కానీ ఇప్పుడు అతను రేవ్ పార్టీ ఆర్గనైజర్, డ్రగ్స్ డీలర్, పాము విషం సరఫరా చేసే వ్యక్తిగా  గుర్తింపు పొందాడు. రేవ్ పార్టీలో ఏ పాము విషాన్ని ఉపయోగించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ, నోయిడా పోలీసులు ఎల్విష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నోయిడా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. రేవ్‌ పార్టీలో 9 పాములు, 20 మిల్లీ లీటర్ల పాము విషాన్ని అక్కడ స్వాధీనం చేసుకున్నారు. జంతు హక్కుల సంఘం పీపుల్ ఫర్ యానిమల్స్ (పిఎఫ్‌ఎ) గురువారం సెక్టార్ 51లోని ఒక బాంకెట్ హాల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్టీ కోసం వచ్చిన వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న కోబ్రాలతో సహా తొమ్మిది పాములను కూడా రక్షించినట్లు అధికారులు తెలిపారు. .

నిందితుడి వద్ద నుంచి ప్లాస్టిక్ బాటిల్‌లో భద్రపరిచిన 20 మిల్లీలీటర్ల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అది మానవ శరీరంలో పార్టీ డ్రగ్ లాంటి ప్రభావాన్ని కలిగించే విధంగా సైకోట్రోపిక్ స్వభావం కలిగి ఉందో లేదో నిర్ధారించడానికి పరీక్ష కోసం పంపారు.

ఇవి కూడా చదవండి

రేవ్‌ పార్టీలనే విదేశీ కల్చర్‌ ఇప్పుడు మన దేశానికి విపరీతంగా పాకింది. రేవ్‌ పార్టీల పేరుతో విషాన్ని వినోద ఔషధంగా ఉపయోగించడం మాత్రం మనదేశంలో నిషేధం..ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రాణాంతకమైనది కూడా.

మరిన్ని ట్రెండిండ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..